టాలీవుడ్ లో రాణిస్తున్న యంగ్ హీరోల్లో సత్యదేవ్ ఒకరు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి ఆ తర్వాత హీరోగా ఎదిగాడు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేసి సక్సెస్ అందుకుంటున్నాడు సత్యదేవ్. అలాగే సినిమాల రిజల్ట్స్ ఎలా ఉన్న అభిమానులను మాత్రం భారీగానే సంపాదించుకున్నాడు.. చిన్న చిన్న పాత్రల నుంచి ఇప్పుడు హీరోగా ఎదిగాడు ఈ టాలెంటెడ్ యాక్టర్.. పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశాడు. ఉదాహరణకు వరుణ్ తేజ్ డెబ్యూ మూవీ ముకుంద, అలాగే రెబల్ స్టార్ ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్ ఇలా కొన్ని సినిమాల్లో కనిపించాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాల్లో కనిపించి ఆకట్టుకున్నాడు. ఇక రీసెంట్ గా జీబ్రా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఇది కూడా చదవండి : బుర్రపాడు గురూ..! ఈ హీరోయిన్ ఏంటి ఇలా మారిపోయింది..! ఒకప్పటి డ్రీమ్ గర్ల్‌ను గుర్తుపట్టరా.?
పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మించిన ఈ సినిమాకు ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించాడు. సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మించిన ఈ సినిమాకు ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించాడు.
ఇది కూడా చదవండి :Jagapathi Babu: నువ్వంటే నాకు ఇష్టం లేదు.. స్టార్ హీరోయిన్ ముఖంమీదే చెప్పిన జగపతి బాబు.
సత్యదేవ్, డాలీ ధనంజయ, ప్రియ భవాని శంకర్, జెన్నిఫర్ పిక్కినాటో ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా నవంబర్ 22న రిలీజ్ అయ్యింది. రవి బస్రూర్ సంగీతం అందించిన జీబ్రా మూవీ థియేటర్స్ లో మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో రానుంది. జీబ్రా మూవీ ఓటీటీ రైట్స్ ను ఆహా సొంతం చేసుకుంది. త్వరలోనే ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ కు రానుంది. ఈమేరకు ఆహా అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. థియేటర్స్ లో మంచి విజయాన్ని అందుకున్న జీబ్రా సినిమా ఓటీటీలో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.