Yellow custard apple: ఆంధ్రాలోనే దొరుకుతుందట ఈ పసుసు సీతాఫలం.. ఇంకా బోలెడు ముచ్చట్లు చెబుతోంది

Yellow custard apple: ఆంధ్రాలోనే దొరుకుతుందట ఈ పసుసు సీతాఫలం.. ఇంకా బోలెడు ముచ్చట్లు చెబుతోంది


పసుపు సీతాఫలం వచ్చేసిందండోయ్… ఏటేటీ పసుపు సీతాఫలమా… నువ్వు ఎప్పుడు, ఎక్కడి నుంచి వచ్చావు తల్లీ…? అనకుంటున్నారా..? సమాధానం తన మాటల్లోనే వినేద్దాం పదండి….

“నేనేమీ వచ్చేయలేదండి.. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం బుర్రిలంక సప్తగిరి నర్సరీ రైతు కుప్పాల దుర్గారావు  ఉన్నారు కదండీ.. ఆయన తీసుకొచ్చారండి. నేను ఉండేది థాయిలాండ్ దేశంలో…అక్కడి నుంచి ఈ దుర్గారావు ఎన్నో కొత్తరకం మొక్కలు తీసుకొచ్చి ఇక్కడ ఉత్పత్తి చేయడం మీకు తెలిసిందే కదండీ… నేను ఎలా అలానే మీ ప్రాంతానికి వచ్చానండీ…”

ఓహో…ఆయన తీసుకొచ్చారా…….అయితే ఇక నీవు మా ఇంటి దానివే. ఎందుకంటే నీవు జీవం పోసుకున్నది ఇక్కడే కదా మరి…

అవునండి.. మూడేళ్ల క్రితం నా మొక్కను తీసుకొచ్చి ఇక్కడ నాటారు. ఇప్పటికి పెరిగి పెద్దయి పండు నయ్యాను. ఇక నా ప్రత్యేకతలు ఏంటంటారా చాలా ఉన్నాయండోయ్. ఒక్క పసుపు రంగ మాత్రమే కాదు సీతాఫలం జాతిలో నేనొక విచిత్రమైన రకాన్ని. నా లోపల గుజ్జు ఎంతో రుచికరంగా ఉంటుంది. అంతేకాదు చాలా గట్టిగాను ఉంటుంది. చాకుతో కోసుకుని తినే విధంగా. పై తొక్క దలసరిగా ఉండటం వల్ల దాన్ని ఒలుసుకొని లోపల భాగాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుని తినవచ్చు.

అబ్బో చాలా ప్రత్యేకతలు ఉన్నాయే…

అంతటితో అయిపోలేదండి. ఇక్కడ దొరికే సీతాఫలం ఏడాదికి ఒక్కసారి మాత్రమే దిగుబడినిస్తుంది. కానీ నేను రెండుసార్లు దిగుబడికి వస్తాను.

మాకు కావాలంటే నీ మొక్కలు దొరుకుతాయా…?

కడియం నర్సరీల గురించి మీకు కొత్తగా చెప్పేదేముందండి. ఇక్కడ నర్సరీలు తలుచుకుంటే ఎన్నో మొక్కలను ఉత్పత్తి చేస్తారు.థాయిలాండ్ నుంచి తీసుకొచ్చిన మొక్కను సప్తగిరి నర్సరీ యజమాని ఇక్కడ వాతావరణంకు అనుకూలంగా పెంచి పోషించారు. ఇప్పటికే ఆ మొక్క కాండాలకు అంట్లు కట్టి పది పదిహేను వరకు అమ్మకాలు సాగించారు. వచ్చే సంక్రాంతి తర్వాత మరిన్ని అంట్లు కట్టడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నారు. ఏంటండీ… మొక్క ధర ఎంతో అడగాలని ఉందా. మొదట్లో మూడు నాలుగు వందలుంటాయి. ఉత్పత్తి పెరిగేకొద్దీ నలభై ఏభై రూపాలకు కూడా లభిస్తాయి.

అంటే రాబోయే రోజుల్లో పసుపు సీతాఫలం మా అందరికీ అందుబాటులోకి వస్తుందన్నమాట. నీకు మా కడియం ప్రాంతంలోనే గాక మా దేశంలో మంచి భవిష్యత్తు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ స్వాగతిస్తున్నాం..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *