Year Ender 2024: 2024లో పోలీసు కేసుల్లో చిక్కున్న సెలబ్రెటీలు వీరే.. ఒకొక్కరిది ఒకొక్క కథ

Year Ender 2024: 2024లో పోలీసు కేసుల్లో చిక్కున్న సెలబ్రెటీలు వీరే.. ఒకొక్కరిది ఒకొక్క కథ


మరికొద్ది రోజుల్లో 2024కు గుడ్ బై చెప్పనున్నాం.. 2025కు వెల్కమ్ చెప్పే రోజు కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. కాగా 2024లో ఎన్నో మెమొరీస్ ను అందించింది. సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు విడుదలయ్యాయి. తెలుగు సినిమా కీర్తి 2024లో మరింతగా పెరిగింది. రీసెంట్ గా రిలీజ్ అయిన పుష్ప 2 సినిమా కేవలం ఆరు రోజుల్లోనే 1000కోట్లకు పైగా కలెక్ట్ చేసి తెలుగు సినిమా సత్తా ఏంటో మరోసారి నిరూపించింది. అలాగే ఈ ఏడాదిలో సినిమా ఇండస్ట్రీలో చాలా మంది పోలీసు కేసుల్లోనూ చిక్కుకున్నారు. రీసెంట్ గా మోహన్ బాబు పై కూడా కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. టీవీ9 రిపోర్టర్ పై దాడి చేసిన మోహన్ బాబు పై హత్యాయత్నం కేసు నమోదు అయ్యింది. అలాగే  2024 లో పోలీస్ కేసుల్లో చిక్కుకున్న సినీ సెలబ్రెటీలు ఎవరో ఒక్కసారి చూద్దాం..

ముందుగా లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న రాజ్ తరుణ్. ఈ యంగ్ హీరో లావణ్య ఆమె యువతిని ప్రేమ పేరుతో మోసం చేశాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనతో సహజీవనం చేసి చివరకు పెళ్లి చేసుకోకుండా మరో హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నాడు అని లావణ్య ఆరోపించింది. రాజ్ తరుణ్, లావణ్య డ్రామా చాలా రోజులు నడిచింది. ఇప్పుడు ఇద్దరూ సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత కన్నడ హీరో దర్శన్.. ఇతగాడు గర్ల్ ఫ్రెండ్ కోసం ఓవ్యక్తిని దారుణంగా చంపించాడు. తన ప్రియురాలికోసం దర్శన్.. తన అభిమాని అయిన రేణుకాస్వామిని కొంత మందితో కలిసి చంపించాడు. దాంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో వేశారు.

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్.. తన అసిస్టెంట్ ను లైంగికంగా వేదించాడన్న ఆరోపణల నేపథ్యంలో పోలీసులు జానీ మాస్టర్ ను అరెస్ట్ చేశారు. జైలు జీవితం అనుభవించిన జానీ ఇటీవలే బెయిల్ పై బయటకు వచ్చాడు. ఇక తెలుగు వారి పై నోటికొచ్చింది వాగి చిక్కుల్లో పడింది నటి కస్తూరి శంకర్. తెలుగు వారి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కస్తూరి శంకర్ పై పోలీస్ కేసు నమోదు అయ్యింది. విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇస్తే ఆమె అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. చివరకు ఆమెను పట్టుకున్నారు పోలీసులు. ఇక ఇప్పుడు మోహన్ బాబు.. మంచు మనోజ్, మోహన్ బాబు కు మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మనోజ్ మోహన్ బాబు ఇంటికి వెళ్లిన క్రమంలో అక్కడ ఉన్న మీడియా ప్రతినిధుల పై మోహన్ బాబు దాడి చేశాడు. ఈ దాడిలో టీవీ9 రిపోర్టర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ క్రమంలో మోహన్ బాబుకు వెతిరేకంగా జర్నలిస్ట్ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. పోలీసులు మోహన్ బాబు పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *