దక్షిణాఫ్రికా కెప్టెన్ తెంబా బవూమా తన జట్టు తొలిసారి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌లో చోటు సంపాదించడంపై దృష్టి పెట్టిందని స్పష్టం చేశాడు. వచ్చే ఏడాది జూన్‌లో లార్డ్స్ మైదానంలో జరగనున్న ఈ ప్రెస్టీజియస్ మ్యాచ్‌లో తమ జట్టు పాల్గొనడం ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు.
డిసెంబర్ 26న సెంచూరియన్‌లో బాక్సింగ్ డే మ్యాచ్‌తో ప్రారంభమయ్యే పాకిస్తాన్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో కనీసం ఒక మ్యాచ్‌ను గెలవడమే తమ ప్రాథమిక లక్ష్యమని చెప్పారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా 63.33 PCTతో WTC పాయింట్స్ టేబుల్ లో అగ్రస్థానంలో ఉంది. శ్రీలంకపై 2-0 విజయంతో తమ ప్రదర్శనను మెరుగుపరచుకున్న దక్షిణాఫ్రికా, ఇప్పుడు అదే జోరును కొనసాగించాలనే సంకల్పంతో ఉంది.
బావుమా తన వ్యాఖ్యలలో WTCను రెడ్-బాల్ ప్లేయర్ల ప్రపంచకప్‌గా అభివర్ణించారు. “ఇది ప్రతి టెస్ట్ క్రికెట్ ఆటగాడి స్వప్నం. ఆ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో పాల్గొనడమే కాదు, దానిని గెలుచుకోవడమే మా గమ్యం. ఇది క్రికెట్ ప్రపంచానికి ఎంతో ముఖ్యమైన సందర్భం,” అని వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం WTC సైకిల్ ఉత్కంఠభరితంగా ముగింపు దశకు చేరుకుంటుండగా, దక్షిణాఫ్రికా కెప్టెన్ టెస్ట్ క్రికెట్ ప్రత్యేకతను కూడా వివరించాడు. టెస్ట్ క్రికెట్ అనేది ప్రతీ అతగాడి నైపుణ్యాలకు, మానసిక తత్వానికి కఠినమైన పరీక్ష అని, బవూమా అభిప్రాయపడ్డాడు.
ఇదిలా ఉండగా, ఫైనల్‌కు పోటీలో ఉన్న ఇతర జట్లలో ఆస్ట్రేలియా, భారత్‌లు కూడా తమ స్థానాలను కాపాడుకోవడానికి పోరాడుతున్నాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియా 58.89 PCTతో రెండవ స్థానంలో, భారత్ 55.88 PCTతో మూడవ స్థానంలో ఉంది. ఈ ఉత్కంఠభరిత పోటీ దక్షిణాఫ్రికా కెప్టెన్‌కి మోటివేషన్‌గా మారి, వారి ప్రదర్శనను మరింత మెరుగుపరుస్తుందని ఆశిస్తున్నాడు.