Winter Tips: చలికాలంలో పాలు తాగడానికి నియమాలున్నాయి.. ఎలా తాగడం వలన ఉపయోగమంటే

Winter Tips: చలికాలంలో పాలు తాగడానికి నియమాలున్నాయి.. ఎలా తాగడం వలన ఉపయోగమంటే


చలికాలంలో పాలు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. పాలు శరీరానికి వెచ్చదనాన్ని అందించడమే కాదు రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. పాలను సంపూర్ణ ఆహారం అని కూడా అంటారు. విటమిన్ ఎ, బి12, డి, క్యాల్షియం, ప్రొటీన్లు, పొటాషియం, మెగ్నీషియం, కొవ్వు వంటి పోషకాలు ఇందులో లభిస్తాయి. అయితే చలికాలంలో పాలు తాగడానికి సరైన మార్గం ఏమిటంటే..
శ్రీ బాలాజీ యాక్షన్ మెడికల్ ఇనిస్టిట్యూట్ చీఫ్ డైటీషియన్ ప్రియా పాలివాల్ మాట్లాడుతూ.. శీతాకాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచేందుకు అదనపు శక్తి అవసరమని, పాలు ఈ అవసరాన్ని తీర్చడంలో సహాయపడతాయని చెప్పారు. అయితే ఈ సీజన్‌లో పాలు త్రాగడానికి సరైన మార్గం గురించి తెలుసుకోవాలి. అప్పుడే పాలు తాగడం వలన కలిగే పూర్తి ప్రయోజనం పొందుతారు.

పాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటంటే

రోజూ పాలు తాగడం వల్ల ఎముకలు బలపడతాయి. దీనితో పాటు పాలు చర్మం, జుట్టుకు కూడా ఉపయోగకరంగా పరిగణించబడుతున్నాయి. పాలలో విటమిన్ బి 12 ఉంటుంది. జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి చాలా ముఖ్యమైనవి. అంతేకాదు రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు, జీర్ణక్రియకు కూడా మేలు చేస్తాయి.

పాలు త్రాగడానికి సరైన మార్గం ఏమిటంటే

చలికాలంలో చల్లటి పాలు తాగకూడదని గుర్తుంచుకోండి అని ప్రియా పలివాల్ చెప్పింది. చలికాలంలో గోరువెచ్చని పాలు తాగితే చలి నుంచి కాపాడటమే కాకుండా జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. చల్లని వాతావరణంలో ఒక గ్లాసు పాలలో చిటికెడు పసుపు లేదా కొద్దిగా తేనె కలపండి. దీంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

పూర్తిగా ఫిల్టర్ చేయండి

చలికాలంలో పాలు తాగే ముందు బాగా వడకట్టి కాసేపు మరిగించాలి. ఇది పాలలో ఉండే హానికరమైన బ్యాక్టీరియాను తొలగిస్తుంది. శరీరానికి ఎటువంటి హాని కలిగించదు. అయితే కొంతమందికి పాలు తాగడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. చాలా మంది అలెర్జీలతో బాధపడవచ్చు, మరికొందరికి లాక్టోస్ అసహనం ఉండవచ్చు. ఇలాంటి వారు పాలు తాగితే కడుపు నొప్పి కలుగుతుంది. అయితే ఇలాంటి సమస్య ఏదైనా ఉంటే.. ఖచ్చితంగా ఒకసారి ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.

ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గమనిక: ఇక్కడ ఉన్న విషయాలు సమాచారం కోసం మాత్రమే. మీకు ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *