Winter Solstice: ఏడాదిలో వింటర్ సోల్స్‌టిస్‌కి చాలా ప్రత్యేకత.. సూర్యుడి అనుగ్రహం కోసం ఏమి చేయాలంటే

Winter Solstice: ఏడాదిలో వింటర్ సోల్స్‌టిస్‌కి చాలా ప్రత్యేకత.. సూర్యుడి అనుగ్రహం కోసం ఏమి చేయాలంటే


ప్రతి సంవత్సరం అతి తక్కువ ఉదయం.. ఎక్కువ రాత్రి ఉండే రోజు ఒకటి వస్తుంది. ఆంగ్లంలో వింటర్ సోల్స్‌టిస్ అని అంటారు. సంవత్సరంలో ఈ షార్టెస్ట్ డే, లాంగెస్ట్ నైట్ రోజు డిసెంబర్‌లో ఉంటుంది. డిసెంబరు 21 లేదా 22 న వస్తుంది. ఈ రోజు భూమి 23.5 డిగ్రీల అక్షాంశంలో ఉన్నప్పుుడు ఈ ఖగోళ ప్రక్రియ సంభవిస్తుంది. వింటర్ సోల్స్‌టిస్ అంటే భూమి ఉత్తర ధృవం సూర్యుడికి బాగా దూరంగా ఉన్నప్పుడు ఇది సంభవిస్తుంది. దీనివల్ల పగలు చిన్నదిగా రాత్రి పెద్దదిగా ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సంవత్సరంలో అతి తక్కువ రోజులో సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో సూర్యభగవానుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతాడు.

జ్యోతిష్యం ప్రకారం

మకర సంక్రాంతిని సూర్య భగవానుడి ఉత్తరాయణానికి నాందిగా భావిస్తారు. ఉత్తరాయణం సానుకూల శక్తి, సమయం. సూర్యుడు జీవితానికి కారకంగా పరిగణించబడ్డాడు. సంవత్సరంలో వింటర్ సోల్స్‌టిస్ రోజున సూర్యుని శక్తి చాలా తక్కువగా ఉంటుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం బలహీనమైన సూర్యుడు ఆత్మవిశ్వాసం, ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాడు. అయితే ఈ వింటర్ సోల్స్‌టిస్ సమయం ఆధ్యాత్మికత, జ్ఞాన పరంగా మంచిది. ఎందుకంటే ఈ సమయానికి సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రాశిపై బృహస్పతి ప్రభావం ఉంటుంది.

వింటర్ సోల్స్‌టిస్ రోజున ఏమి చేయాలంటే

అత్యంత ప్రాముఖ్యత కలిగిన వింటర్ సోల్స్‌టిస్ రోజు చీకటి నుంచి వెలుగులోకి వెళ్లడానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో నెగెటివ్ ఎనర్జీ, అలవాట్లను వదిలేసి జీవితంలో కొత్త నిర్ణయాలను తీసుకోవాలి. ఈ రోజున దానం చేయడం శుభప్రదమని నమ్మకం. మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున ఆహారం, బట్టలు, డబ్బును దానం చేయడం శ్రేయస్కరం. బలహీనమైన సూర్యుడిని బలోపేతం చేయడానికి..’ఓం సూర్యాయ నమః’ అనే మంత్రాన్ని జపించాలి. గాయత్రీ మంత్రాన్ని పఠించడం కూడా ప్రయోజనకరం. ఆయుర్వేదం ప్రకారం సంవత్సరంలో అతి తక్కువ రోజు శారీరక స్వచ్ఛతను.. రానున్న చలి నుంచి రక్షణను కూడా సూచిస్తుంది. సూర్యుని బలహీనత వల్ల శరీరంలో శక్తి తగ్గవచ్చు. కనుక ఈ రోజు సాత్విక ఆహారాన్ని మాత్రమే తినాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *