చలికాలంలో గర్భిణులు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సీజన్లో రోగనిరోధక శక్తి బాగా తగ్గిపోతుంది. దీని కారణంగా అనేక వ్యాధులు శరీరాన్ని సులభంగా ప్రభావితం చేస్తాయి.
కాబట్టి గర్భిణీలు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ముఖ్యమైన ఆహారాలు తీసుకోవాలి. వాటిలో బాదం, వాల్నట్లు ప్రముఖమైనవి. వీటిలో విటమిన్ ఇ, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడతాయి.
విటమిన్ సి ఉన్న పండ్లను కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఈ సీజన్లో ఆరోగ్యంగా ఉండాలంటే పాలకూర అధికంగా తీసుకోవాలి. పాలకూరతో పాటు ఇతర ఆకు కూరలు కూడా తీసుకోవచ్చు.
అయితే పాలకూర చాలా మంచిది. ఇందులో ఐరన్, ఫోలేట్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రక్త కణాల తయారీలో సహాయపడుతుంది. సాధారణంగా గర్భిణీలు చలి కాలంలో చేపలను ఎక్కువగా తినాలి. చేపలు తినడం ద్వారా పిల్లల మెదడు బాగా అభివృద్ధి చెందుతుంది.
అంతేకాదు పిల్లల మెదడు చురుకుగా పని చేస్తుంది. అలాగే దుంపలు కూడా శీతాకాలంలో సమృద్ధిగా లభిస్తాయి. ఇవి వ్యాధి నిరోధక శక్తిని పెంచడమే కాకుండా బిడ్డ ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తాయి. గర్భిణులు ఈ ఆహారాలను తప్పనిసరిగా తీసుకోవాలి. వీటితోపాటు రోజూ తేలికపాటి వ్యాయామాలు కూడా చేయాలి.