White Pulihora: ఈ వైట్ పులిహోర ఎప్పుడైనా తిన్నారా.. డిఫరెంట్ టేస్ట్!

White Pulihora: ఈ వైట్ పులిహోర ఎప్పుడైనా తిన్నారా.. డిఫరెంట్ టేస్ట్!


పులిహోర అంటే చాలా మందికి ఇష్టం. పులిహోరను ఎక్కువగా దేవుడికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు. కొన్ని సార్లు ఇంట్లో అన్నం మిగిలిపోయినప్పుడు కూడా చేస్తూ ఉంటారు. పులిహోరలో చాలా రకాలు ఉన్నాయి. ఉసిరి, నిమ్మ, గోంగూర, ఆవపిండి ఇలా చాలా రకాలుగా చేయవచ్చు. ఇది చాలా రుచిగా ఉంటుంది. కానీ వైట్ పులిహోరను ఎప్పుడైనా విన్నారా.. ఇది కూడా టేస్టీగానే ఉంటుంది. వైట్ పులిహోరను ఎక్కువగా కర్ణాటకలో చేస్తూ ఉంటారు. ఇందులో పసుపు వేయకుండా చేస్తారు. ఒక్కసారి రుచి చూశారంటే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మరి ఈ వైట్ పులిహోర ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

వైట్ పులిహోరకు కావాల్సిన పదార్థాలు:

ఉడికించిన అన్నం, ఉప్పు, మిరియాలు, జీడిపప్పు, పల్లీలు, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, ఎండు మిర్చి, మెంతి ఆకుల తరుగు, నిమ్మరసం, కొబ్బరి తురుము, తాళింపు దినసులు, కొత్తిమీర, కరివేపాకు, నెయ్యి, ఆయిల్.

వైట్ పులిహోర తయారీ విధానం:

ముందుగా వైట్ పులిహోరను తయారీకి ముందు.. అన్నాన్ని పొడిపొడిగా వండి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయి తీసుకుని స్టవ్ మీద పెట్టి కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఇందులో కొద్దిగా జీడిపప్పు, వేరు శనగలు వేసి క్రంచీగా వేయించాలి. తర్వాత వీటిని తీసి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఇందులోనే ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, పచ్చి మిర్చి, శనగపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఫ్రై చేయాలి.

ఇవి కూడా చదవండి

ఆ నెక్ట్స్ ఉల్లిపాయలను కూడా రంగు మారేంత వరకు ఫ్రై చేసిన తర్వాత.. మెంతి కూర తరుగు, సాల్ట్ వేసి పచ్చి వాసన పోయే దాకా వేయించాలి. ఆ నెక్ట్స్ కొబ్బరి తరుగు వేసి ఒకసారి వేయించాక.. ఉడికించిన అన్నాన్ని కూడా వేసి ఓ పది నిమిషాలు ఫ్రై చేయాలి. ఇప్పుడు పై నుంచి నుంచి నిమ్మ రసాన్ని, కొత్తిమీర తరుగు, వేరుశనగ, జీడిపప్పు కూడా వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే తెల్ల పులిహోర సిద్ధం. ఈ పులిహోర కూడా సింపుల్‌గా అయిపోతుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *