Weather: ఏపీలో వర్షాలు.. తెలంగాణలో చలి, మంచు.. తెలుగు రాష్ట్రాల లేటెస్ట్ వెదర్ రిపోర్ట్

Weather: ఏపీలో వర్షాలు.. తెలంగాణలో చలి, మంచు.. తెలుగు రాష్ట్రాల లేటెస్ట్ వెదర్ రిపోర్ట్


బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. తీవ్ర అల్పపీడనంగా బలపడి పశ్చిమ-వాయువ్య దిశగా దక్షిణ తమిళనాడు వైపు కదులుతుందని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ వాతావరణ వ్యవస్థతో అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించిందని వెల్లడించింది. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే సూచనలకు దారితీసింది.

ముఖ్యంగా ప్రకాశం, కడప, తిరుపతి, చిత్తూరు, కర్నూలు, అన్నమయ, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. >చిత్తూరు, తిరుపతి, అన్నమయ జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయని, రైతులు తమ పంటలను కాపాడుకోవడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.  ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో పాఠశాలలు, కళాశాలలకు జిల్లా కలెక్టర్‌ సెలవు ప్రకటించారు.

తెలంగాణలో చలి… 

తెలంగాణలో రాగల 3 రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల తక్కువ నమోదయ్యే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో మూడు రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉదయం వేళల్లో పొగమంచు కురుస్తుందని వెల్లడించింది. ఉత్తర తెలంగాణలో కొన్ని ప్రాంతాలలో మూడు రోజులు అక్కడక్కడ చలి గాలులు వీస్తాయని పేర్కొంది.

 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *