పండ్లు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. పండ్లలో విటమిన్లు, మినరల్స్, ఫైబర్, కాల్షియం, ఐరన్ వంటి శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు అందుతాయి. ఎన్నో రకాల పండ్లు ఉన్నాయి. ప్రతిదీ దానివైన ప్రత్యేక ప్రయోజనాలు కలిగి ఉంటాయి. పండ్లను తినడం వల్ల ఎక్కువ ప్రయోజనాలను పొండాలంటే.. వాటిని సరైన సమయం, సరైన మోతాదు, సరైన పద్ధతిలో తినాలి.
చాలా మంది రాత్రి లేదా మధ్యాహ్నం భోజనం తర్వాత పండ్లను తింటారు. ఈ పద్ధతిలో పండ్లు తినడం పూర్తిగా తప్పు. అలాగే చాలా మంది పండ్లు తిన్న తర్వాత ఎక్కువగా నీరు తాగుతుంటారు. ఇది కూడా పొరబాటే. ముఖ్యంగా దానిమ్మ తిన్న తర్వాత పొరబాటున కూడా నీళ్లు తాగకూడదు. ఇలా చేయడం వల్ల వికారం, ఎసిడిటీ, వాంతులు వస్తాయి.
అరటిపండ్లు తక్షణ శక్తిని అందిస్తాయి. వీటిల్లో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది. అరటిపండ్లు మలబద్ధకం, కడుపు సమస్యల నుండి ఉపశమనాన్ని అందించినప్పటికీ, వీటిని తిన్న తర్వాత నీరు త్రాగడం జీర్ణవ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.
నారింజ, ఉసిరి, ద్రాక్ష, మాంగోస్టీన్ మొదలైన పుల్లని పండ్లు తిన్న తర్వాత నీళ్లు తాగడం సరికాదు. ఇలా చేయడం వల్ల, శరీరంలోని pH స్థాయి క్షీణిస్తుంది. జీర్ణవ్యవస్థ కూడా చెదిరిపోతుంది.
అలాగే పుచ్చకాయ. ఇది స్వతహాగానే నీటి పండు. పుచ్చకాయ తిన్న తర్వాత నీళ్లు తాగకూడదని వైద్యులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల మీ జీర్ణవ్యవస్థకు ఆటంకం కలుగుతుంది. పియర్ పండ్లు తిన్న తర్వాత కూడా నీళ్లు తాగకూడదు. ఇందులో ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ సి కాకుండా ఫోలిక్ యాసిడ్, పొటాషియం, కాపర్ అధికంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల జీర్ణ సమస్యలు దూరం అవుతాయి. కానీ తిన్న తర్వాత నీళ్లు తాగితే జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది.