Papikondalu Tour: గోదావరి అందాను చూస్తూ సాగే పాపికొండల విహారయాత్రకు షార్ట్ బ్రేక్‌పడింది. అల్లూరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీ పోచమ్మ గండి నుంచి పాపికొండల విహారయాత్రకు కాస్త విరామం పడింది. సీఎం చంద్రబాబు పోలవరం పర్యటన నేపథ్యంలో అధికారులు బోట్లు నిలిపివేశారు. నిన్నటి నుంచి మూడు రోజులు నిలిపివేయడంతో పర్యాటకులతో పాటు బోటు యజమానులు ఆందోళన చెందుతున్నారు.
ఈ మూడు రోజుల్లో విహారయాత్ర కోసం వివిధ రాష్ట్రాలకు చెందిన 600 మంది యాత్రికులు పాపికొండలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే ఉన్నపళంగా యాత్ర నిలిపివేయడంతో యాత్రికులకు ఏం చెప్పాలో తెలియక బోటు యజమానులు ఆందోళన చెందుతున్నారు.