Watch Video: ఏడుగురి ప్రాణాలు తీసిన బస్సు.. ఒళ్ళు గగుర్పాటుకు గురి చేస్తున్న బస్సు ప్రమాద దృశ్యాలు..

Watch Video: ఏడుగురి ప్రాణాలు తీసిన బస్సు.. ఒళ్ళు గగుర్పాటుకు గురి చేస్తున్న బస్సు ప్రమాద దృశ్యాలు..


ముంబైలో డిసెంబర్ 9వ తేదీన జరిగిన బస్సు ప్రమాదానికి సంబంధించిన సీసీ దృశ్యాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. బృహాన్‌ ముంబై కార్పొరేషన్‌కు చెందిన బస్సు పాదచారులు, వాహనాదారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు.

ఈ ప్రమాద సమయంలో బస్సు లోపలి దృశ్యాలు తాజాగా బయటపడ్డాయి. మరోవైపు, ఈ దుర్ఘటనకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బస్సు నడిపిన డ్రైవర్‌కు ఈవీ డ్రైవింగ్‌ అనుభవమే లేనట్టు తెలుస్తోంది. బస్సు అదుపుతప్పిందని గుర్తించిన ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. సీట్లలో నుంచి నిలబడి పోల్స్‌ను గట్టిగా పట్టుకున్నారు. బస్సు గోడను ఢీకొట్టి ఆగిపోగానే ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ నుంచి దూకుతున్న దృశ్యాలు కన్పించాయి. చివరగా బస్సు డ్రైవర్‌ తన రెండు బ్యాగ్‌లను తీసుకుని వాహనం నుంచి బయటకు దూకాడు. ఇవన్నీ సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్‌ అయ్యాయి.

కేవలం 55 సెకన్లలోనే ఈ ఘోరం జరిగిందని బృహాన్‌ ముంబై కార్పొరేషన్‌ అధికారులు తెలిపారు. మొదటి వాహనాన్ని ఢీకొట్టిన తర్వాత దాదాపు 450 మీటర్ల దూరంలో ఉన్న వాహనాలపై నుంచి బస్సు దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్‌పై స్థానికులు దాడికి పాల్పడ్డారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని అతడిని అరెస్టు చేశారు.

వీడియో చూడండి.. 

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *