భారత్ నుంచి థాయ్‌లాండ్ వెళ్తున్న విమానంలో కొందరు ప్రయాణికుల ప్రవర్తన తీవ్ర విమర్శలకు దారి తీసింది. అందుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారాయి. ‘థాయ్‌లాండ్ సిరీస్ పార్ట్ వన్’ పేరుతో ఉన్న ఈ వీడియోను ‘సర్కాస్మ్ విత్ అంకిత్’ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి షేర్ చేయబడింది. దీనిని ఇప్పటివరకు 15 లక్షల మందికి పైగా వీక్షించారు. ఘటన జరిగిన సమయంలో విమానం వేల అడుగుల ఎత్తులో ఉందని చూపించేందుకు విమానం కిటికీ వెలుపలి దృశ్యం కూడా వీడియోలో చూపించారు. ఇకపోతే, అసలు విషయం ఏంటంటే..
విమానంలో ప్రయాణికులంతా హాయిగా కూర్చొని ఉండగా.. కొందరు తమను పట్టించుకునే వారే లేరంటూ నిలబడి ఉండటం ఆ వీడియోలో కనిపించింది. ఒక ప్రయాణికుడు తన వెనుక కూర్చున్న వ్యక్తికి ఏదో చెప్పడానికి సీటుపై ఒరిగి నిలబడి ఉన్నాడు. మరికొందరు ప్రయాణికులు సీట్ల మధ్య నిలబడి భోజనం చేస్తున్నారు. విమానంలో ప్రయాణికుల తీరు చూస్తుంటే అదేదో లోకల్ ట్రైన్ లో ప్రయాణిస్తున్నట్లుగా అనిపిస్తుంది కదూ..! కానీ, తామంతా విమానంలో ప్రయాణిస్తున్నామని, అది కూడా విమానం వేల అడుగుల ఎత్తులో ఎగురుతుందని ఇన్‌స్టా ఖాతాదారు అంకిత్ తెలిపారు.
View this post on Instagram
ఈ వీడియోలో చూసిన ప్రయాణికులపై పలువురు నెటిజన్లు స్పందించారు. వీరిలో ఒక వ్యక్తి స్పందిస్తూ..ఎంత సంపాదించినా కూడా డబ్బు విలువలను తీసుకురాదని వ్యాఖ్యనించారు. మరొకరు ఇలా వ్రాశారు.. ఇది సరిగ్గా భారతీయ లోకల్ రైలు లాగానే ఉందంటూ ఫన్నీగా కామెంట్ చేశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..