Watch: యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..

Watch: యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..


హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గట్టిగా మందిలించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు హెల్మెట్ ఉపయోగం, అవసరంపై అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లాలోని పలు చోట్ల డిఎస్పీల ఆధ్వర్యంలో హెల్మెట్లు పెట్టుకొన్న పోలీసులు బైక్ ర్యాలీలు నిర్వహించారు. అంతేకాకుండా కాలేజ్, రద్దీ కూడళ్లలో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి హెల్మెట్ ధరిస్తే వచ్చే ఉపయోగాల గురించి చెబుతున్నారు. అయితే, వీటన్నింటికి భిన్నంగా గుంటూరులో ట్రాఫిక్ సిఐ అశోక్ కుమార్ ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమ పలువురిని ఆకట్టుకుంది. అంతేకాకుండా.. ఎస్పీ నుంచి ప్రసంశలు కూడా అందాయి..

గుంటూరు మార్కెట్ సెంటర్ లో యమధర్మరాజు వేషంలో ఉన్న వ్యక్తితో వినూత్న అవగాహన కార్యక్రమం నిర్వహిచంారు.. యమధర్మరాజు రూపంలో ఉన్న వ్యక్తి.. ట్రాఫిక్ కానిస్టేబుళ్లతో పాటే ఉంటూ ఎవరైతే హెల్మెట్ పెట్టుకోకుండా వెలుతున్నారో వారి దగ్గరికి వెళ్లి హెల్మెట్ లేకపోతే యమధర్మరాజు మిమ్మల్ని ఫాలో అవుతున్నట్లే అని చెబుతూ అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాకుండా హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే జరిగే, జరుగుతున్న అనర్ధాల గురించి వివరిస్తారు. హెల్మెట్ పెట్టుకుంటే తలను ఎలా కాపాడుకోవచ్చో చెబుతారు. యముడు వేషంలో ఉన్న వ్యక్తి ఇవన్నీ వివరిస్తుంటే బైక్ ప్రయాణీకులు ఆసక్తిగా వింటున్నారు. హెల్మెట్ లేని ప్రయాణం అత్యంత ప్రమాదకరమన్న విషయాన్ని బైక్ పై ప్రయాణించే వారికి వివరిస్తున్నారు.

వీడియో చూడండి..

రోడ్డు మీద యముడు వేషధారణలో తిరుగతూ కూడళ్ల వద్ద ట్రాపిక్ ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనడంపై ఎస్పీ సతీష్ కుమార్ ప్రసంశించారు. గుంటూరు నగరంలో అందరికీ హెల్మెట్ ఉపయోగాలను తెలియజేస్తామన్నారు. అవగాహన పెంచుకొని అందరూ హెల్మెట్ తప్పనిసరిగా ఉపయోగించాలన్నారు. వీటితో పాటు అనేక కార్యక్రమాల ద్వారా రోడ్డు ప్రమాదంలో మరణాలు సంఖ్య తగ్గించడానికి పోలీసులు తమ వంతు పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరించి హెల్మెట్ పెట్టుకొని ప్రయాణించాలని సూచించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *