పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఒక మర్చిపోలేని జ్ఞాపకం.. ఆ జ్ఞాపకాన్ని మరింత మధురంగా, అందంగా దాచుకోవాలి అందరూ ప్రయత్నిస్తారు. ఇందుకోసం పెళ్లి వేడుకను ఎంతో ఘనంగా, ఎవరూ ఊహించని విధంగా విహహం చేసుకుంటుంటారు. ఇటీవలి కాలంలో ఇలాంటి పెళ్లి వేడుకలు రోజుకో కొత్త ట్రెండ్‌ని క్రియేట్ చేస్తున్నాయి. చాలా మంది జంటలు తమ వివాహాన్ని ప్రత్యేకంగా చేసుకోవడానికి కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉంటారు. ఈసారి యానిమల్ సినిమాలోని స్టీల్ మెషిన్ గన్ ఆసరాని రంగంలోకి దింపారు. ఇది చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. హాలో బ్రదర్ నువ్వు పెళ్లి చేసుకుంటావా లేదంటే ఏదైనా యుద్ధానికి వెళ్తున్నావా అంటూ కామెంట్లు చేస్తున్నారు…
డిసెంబర్ 1, 2023న విడుదలైన యానిమల్ చిత్రంలో, రణబీర్ కపూర్ తన తండ్రిని రక్షించడానికి డాన్‌గా మారాడు. తనను చంపడానికి వచ్చిన వందలాది మంది వ్యక్తులతో యుద్ధం చేయడానికి స్టీల్ మెషిన్ గన్ ఆసరాను ఉపయోగిస్తాడు. ఈ ఆసరా ఇంటర్నెట్‌లో తీవ్ర హల్‌చల్ సృష్టించింది. ఇప్పుడు ఈ ఫిరంగి స్టైల్ మెషిన్ గన్ పెళ్లిళ్లలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారుతోంది. కొత్త జంట ఇలాంటి విచిత్ర వాహనంపై మండపానికి చేరుకుంది.
View this post on Instagram
వైరల్ వీడియో ఆశిష్ సుయ్వాల్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయబడింది. ఇది ఓ వివాహ వేడుకకు సంబంధించినదిగా తెలుస్తుంది. పెళ్లి మండపంలో ఈ స్టెంగున్‌ను కల్యాణ మండపానికి పక్కనే ఉంచారు. వధూవరులు అదే వేదికపై మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారని తెలుస్తోంది. ఇకపోతే, పెళ్లికి వచ్చిన అతిథులు ఈ వెరైటీ సెటప్ తో సెల్ఫీలు దిగుతూ బిజీబిజీగా గడిపారు. ఇది యానిమల్ సినిమాలో చూపించిన విధంగానే కదులుతుంది. ఈ వీడియో 21 మిలియన్లకు పైగా వీక్షించబడింది. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి