వివో ఎక్స్ 200 సిరీస్ ఫోన్లు క్వాడ్ కర్డ్ అమోలెడ్ డిస్ ప్లేలతో అందుబాటులోకి వచ్చాయి. సొగసైన డిజైన్ తో, స్లిమ్ లుక్కింగ్ తో ఆకట్టుకుంటున్నాయి. వివో ఎక్స్ 200లో 6.67, వివో ఎక్ 200 ప్రోలో 6.78 అంగుళాల డిస్ ప్లే ఏర్పాటు చేశారు. ఈ రెండు 1.5కె రిజల్యూషన్, 120 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేటుతో 4500 నిట్ వరకూ గరిష్ట ప్రకాశాన్ని అందిస్తాయి. విజువల్ చాాాలా స్పష్టంగా కనిపిస్తుంది. నీరు, దుమ్ము నుంచి రక్షణకు ఈ రెండింటిలో పటిష్ట రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఐపీ 68, ఐపీ 69 రేటింగ్ తో దుమ్ము, నీటి నిరోధకతను కలిగి ఉన్నాయి. అలాగే గేమింగ్ తో పాటు రోజు వారీ వినియోగానికి చాలా వీలుగా ఉంటాయి. ఈ రెండు ఫోన్లలో స్వల్ప తేడాలు మినహా కెమెరా వ్యవస్థ చాలా అద్బుతంగా ఉంది. ఫొటోలతో పాటు వీడియోలను చాలా స్పష్టంగా తీసుకోవచ్చు. ఇవి రెండూ 100 ఎక్స్ డిజిటల్ జూమ్ కు మద్దతు ఇస్తాయి. ఎక్స్ 200 ఫోన్ 3 ఎక్స్ ఆప్టికల్ జూమ్, ఎక్స్ 200 ప్రో ఫోన్ 3.7 ఎక్స్ ఆప్టికల్ జూమ్ అందిస్తాయి.
వివో ఎక్స్ 200 ఫోన్ లో 5800 ఎంఏహెచ్, వివో ఎక్స్ 200 ప్రోలో 6000 ఎంఏహెచ్ బ్యాటరీలు ఏర్పాటు చేశారు. వీటిని 90 డబ్ల్యూ ఫాస్ట్ చార్జర్ తో చాలా వేగంగా చార్జింగ్ అవుతాయి. మెరుగైన బ్యాటరీ సామర్థ్యం కారణంగా రోజంతా ఫోన్ ను చక్కగా వినియోగించుకోవచ్చు. సాధారణంగా ఫోన్లలో లిథియం-అయాన్ బ్యాటరీలను ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు సిలికాన్-కార్బన్ బ్యాటరీలు అందుబాటులోకి వచ్చాయి. అయాన్ బ్యాటరీలతో పోల్చితే ఇవి ఎక్కువ శక్తిని నిల్వ చేస్తాయి. అలాగే ఎక్కువ కాలం పనిచేస్తాయి.
వివో ఎక్స్ 200 ఫోన్ రూ.65,999, అలాగే వివో ఎక్స్ ప్రో రూ.94,999 ధరలలో అందుబాటులో ఉన్నాయి. బ్యాంకు ఆఫర్లు, ఇతర డిస్కౌంట్లతో కలిపి రూ.60 వేలు, రూ.85.500కు కొనుగోలు చేయవచ్చు. మెరుగైన కెమెరా, బ్యాటరీ, డిజైన్ కోరుకునేవారికి ఎక్స్ 200 చాలా బాగుంటుంది. మరింత మెరుగైన హార్డ్ వేర్, బ్యాటరీ, సొగసైన డిజైన్ కావాలంటే ఎక్స్ 200 ప్రోకు వెళ్లాల్సిందే.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి