వివేక్ ఒబెరాయ్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని హీరో. రక్త చరిత్ర సినిమాతో టాలీవుడ్ అడియన్స్ కు దగ్గరయ్యాడు. అంతకు ముందు బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. అంతేకాదు.. గతంలో స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్‌తో ప్రేమాయణంతో హాట్ టాపిక్ అయ్యాడు. కానీ వీరిద్దరి ప్రేమ ఎక్కువకాలం సాగలేదు. ఇదిలా ఉంటే.. ఇప్పుడిప్పుడే తిరిగి వరుస సినిమాలతో బిజీ అవుతున్న వివేక్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన తొలి ప్రేమకథను వివరించారు. 13 ఏళ్ల వయసుకే తాను ప్రేమలో పడ్డానని.. ఆమెతో తన జీవితాన్ని ఊహించుకున్నానని అన్నారు. కానీ చివరకు తన ప్రేమకథ విషాదాంతమైందని అన్నారు.
వివేక్ ఒబెరాయ్ మాట్లాడుతూ..”నాకు 13 ఏళ్లు ఉన్నప్పుడు మొదటిసారి ప్రేమలో పడిపోయాను. నాకంటే ఏడాది చిన్నది ఆమె. 18 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తనతో నా ప్రేమ మొదలైంది. తనే నా జీవిత భాగస్వామి అని ఫిక్స్ అయ్యాను. పెళ్లి, పిల్లలు అంటూ జీవితం మొత్తం ఊహించుకున్నాను. కానీ ఓసారి తనకు ఆరోగ్యం బాలేదని చెప్పింది. జ్వరం అనుకున్నాను.. విశ్రాంతి తీసుకుని మళ్లీ వచ్చేస్తుందని అనుకున్నా.. కానీ చాలా రోజులకు కనిపించలేదు. ఫోన్ చేస్తే రెస్పాండ్ కాలేదు. దీంతో ఆమె బంధువులకు ఫోన్ చేస్తే తను ఆసుపత్రిలో ఉందని చెప్పారు. వెంటనే అక్కడికి వెళ్లి చూస్తే తనకు క్యాన్సర్ చివరి స్టేజ్ అని తెలిసింది. ఆసుపత్రిలో బెడ్ పై తనను చూసి తట్టుకోలేకపోయాను. రెండు నెలల్లోనే కన్నుమూసింది. ఆమె మరణాన్ని జీర్ణించుకోలేకపోయాను. తనను మర్చిపోయి మళ్లీ మనిషిగా మారడానికి చాలా కాలం పట్టింది. ఆ తర్వాతే క్యాన్సర్ తో పోరాడుతున్న చిన్నారులకు నా వంతు సాయం చేయాలనే ఆలోచన మొదలైంది” అంటూ చెప్పుకొచ్చారు.
చిన్న వయసులోనే తొలి ప్రేమ విషాదాంతం.. ఆ తర్వాత ప్రేమలో కొన్ని ఎదురుదెబ్బలు తగిలిన తర్వాత పెళ్లిపై తన నిర్ణయం మారిందని వివేక్ తెలిపారు. తాను పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నానని.. కుటుంబసభ్యులు బలవంతం చేయడంతో ప్రియాంకను కలిశానని.. ఆ తర్వాత కుటుంబసభ్యుల సమక్షంలో 2010లో ఆమెను పెళ్లి చేసుకున్నానని చెప్పారు. వివేక్ అటు వ్యాపారరంగంలోనూ సక్సెస్ అయ్యారు.
ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‌బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..
Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‌గా..
Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..
Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‌ను మించిన అందం.. ఎవరంటే..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.