Virat Kohli: రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్.. తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..!

Virat Kohli: రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్.. తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..!


మెల్‌బోర్న్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈరోజు మెల్‌బోర్న్ టెస్టులో విరాట్ కోహ్లీ ఔటై పెవిలియన్ లోపలికి వెళ్లుతుండగా గ్రౌండ్‌లో ఉన్న ఆసీస్ అభిమానులు హేళన చేస్తూ అరిచారు. దీంతో విరాట్ తిరిగి మళ్లీ బయటకు వచ్చి కోపంగా అభిమానుల వైపు చూశాడు. అది చూసి సెక్యూరిటీ సిబ్బంది విరాట్‌కు నచ్చజెప్పి లోపలికి పంపిస్తారు.

మెల్‌బోర్న్ టెస్టు ఆరంభం నుంచి విరాట్ కోహ్లీ వివాదాల్లో చిక్కుకున్నాడు. మొదటి రోజు, విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియన్ ఓపెనర్ సామ్ కాన్స్టాన్స్ భుజంను నెట్టాడు. దీంతో ఐసీసీ ఈ ఘటనపై విరాట్‌కు 20%   ఫీజు కోత విధించడంతో పాటు ఒక్క డీమెరిట్ పాయింట్ ఇచ్చింది. విరాట్ ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఆస్ట్రేలియా అభిమానులు అరవగా, వారిపై చూయింగ్ గమ్ ఉమ్మిన విరాట్ మరో వివాదం కొని తెచ్చుకున్నాడు. తాజాగా విరాట్ కోహ్లీ అవుట్ అయిన తర్వాత ఆస్ట్రేలియా అభిమానులతో వాగ్వాదానికి దిగాడు.

మెల్‌బోర్న్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లి 36 పరుగులు మాత్రమే చేసి పాత తప్పిదంతో మరోసారి వికెట్ కోల్పోయాడు. విరాట్ కోహ్లీ వికెట్‌కి ముందు టీమిండియా 85 పరుగుల వద్ద రనౌట్ అయిన యశస్వి జైస్వాల్ వికెట్ కూడా కోల్పోయింది. ఓవరాల్‌గా రెండో రోజు కూడా టీమ్ ఇండియాకు తీవ్ర నిరాశే మిగిల్చిందిని అని చెప్పాలి.మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న 4వ టెస్టు మ్యాచ్‌లో టీమిండియా కష్టాల్లో పడింది. ఆస్ట్రేలియాను 474 పరుగులకు ఆలౌట్ చేసిన అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి 5 ముఖ్యమైన వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. దీంతో భారత్ ఇంకా 310 పరుగుల వెనుకంజలో ఉంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *