కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత్ సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. డ్యాన్స్ చేస్తున్న వీడియోలు రకరకాల వంటలు తయారు చేస్తున్న వీడియోలు నెట్టింట్లో ప్రత్యక్షం అవుతున్నాయి. కొన్ని వంటలకు సంబంధించిన వీడియోలు ఆకట్టుకుంటే.. మరికొన్ని బాబోయ్ వంటలతో ఇలాంటి ప్రయోగాలు చేసి తినే తిండి మెడ విరక్తి తెప్పిస్తున్నారు అంటూ వాపోతున్నారు కూడా. అలాంటి ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఓ వ్యక్తి చికెన్ టిక్కా చాక్లెట్‌ను తయారు చేస్తున్నాడు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో క్లిప్ నిజానికి జర్మనీకి చెందిన రెస్టారెంట్ యజమాని షేర్ చేశాడు.
ఫ్యూజన్ డెజర్ట్‌కి భోజనప్రియులు షాక్
ప్రయోగాత్మకం అంటూ తినే ఆహారం పై రకరకాల ప్రయోగాలూ చేస్తున్నారు. అయితే చికెన్ ప్రియులకు షాక్ ఇస్తూ ఓ వ్యక్తి చికెన్ తో చికెన్ టిక్కాను తయారు చేస్తూ అందులో చాక్లెట్‌తో కలుపుతున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వినియోగదారు షేర్ చేసిన వీడియో భోజన ప్రియులను షాక్‌కు గురి చేసింది. ఈ డెజర్ట్ ని తయారు చేసే వ్యక్తీ ముందుగా ఫుడ్ కలరింగ్‌ను చాక్లెట్ మౌల్డ్‌లో చల్లుతున్నప్పుడు మొదలైంది. తర్వాత కరిగిన వైట్ చాక్లెట్‌ను అచ్చుపై పొరలుగా చేసి చికెన్ టిక్కాతో నింపాడు. తర్వాత చాక్లెట్ మరొక పొరతో క్లోజ్ చేశాడు. కొన్ని గంటలపాటు దానిని ఫ్రీజ్ చేశాడు. అది గడ్డకట్టిన తర్వాత ఎవరూ ఊహించని స్వీట్, చికెన్ కలిపిన ఫ్యూజన్ డెజర్ట్ రెడీ అయింది.
ఇవి కూడా చదవండి
తన పాక శాస్త్ర ప్రయోగాన్ని కెమెరాలో బంధించాడు. ఈ వీడియో షేర్ చేస్తూ “చికెన్ టిక్కా చాక్లెట్ గురించి మీ ఆలోచనలు ఏమిటి?” అనే శీర్షికని జత చేశాడు. ఒరిజనల్ వీడియో పంజాబ్‌కు చెందిన జర్మన్ ఆధారిత రెస్టారెంట్ యజమాని షేర్ చేశాడు. ఈ వింత వంటకం పేరు “దుబాయిస్ స్కోకోలేడ్ చికెన్ టిక్కా మసాలా” అని తెలుస్తోంది.
వీడియోను ఇక్కడ చూడండి:
ఈ వీడియోపై భిన్నాభిప్రాయాలతో సోషల్ మీడియా ఓ యుద్ధభూమిగా మారింది. అయినా సరే ఈ వీడియో మిలియన్ల కొద్దీ వ్యూస్ ను సొంతం చేసుకుంది. చికెన్ అంటే ఇష్టం ఉన్నవారు మాత్రం తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..