Viral Video: ఇరుగుపొరుగు పిల్లల మధ్య లొల్లి.. చిరిగి చిరిగి చివరకు ఏమైందో చూడండి..! వీడియో

Viral Video: ఇరుగుపొరుగు పిల్లల మధ్య లొల్లి.. చిరిగి చిరిగి చివరకు ఏమైందో చూడండి..! వీడియో


లక్నో, డిసెంబర్‌ 20: సాధారణంగా ఏ ఊరిలోనైనా ఇరుగుపొరుగు పిల్లల మధ్య గొడవలు జరగడం షరా మామూలే. ఒక్కోసారి పెద్దలు కలుగ జేసుకుని పిల్లలకు సర్దిచెబుతుంటారు. దీంతో పిల్లలు మళ్లీ కలిసిపోయి ఆటలాడుకుంటారు. అయితే తాజాగా ఓ గల్లీలో జరిగిన పిల్లల గొడవలు పెద్దలు సిగపట్లు పట్టేదాకా వచ్చాయి. ఇరు వర్గాలు దుమ్ముదుమ్ముగా కొట్టేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్‌ ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో శుక్రవారం (డిసెంబర్ 20) ఉదయం ఈ సంఘటన జరిగింది. వివరాల్లోకెళ్తే..

ఘజియాబాద్‌లోని లక్ష్మీ కాలనీ ప్రాంతానికి చెందిన బీజేపీ నాయకురాలు భావనా బిష్త్ పిల్లలు, పొరుగింటికి చెందిన పిల్లలు ఆడుకుంటూ ఉండగా గురువారం కొట్టుకున్నారు. ఆ తర్వాత ఈ రెండు కుటుంబాలు పరస్పరం క్షమాపణలు చెప్పుకున్నాయి. అయితే, శుక్రవారం ఉదయం ఈ విషయంపై కొంతమంది వ్యక్తులు ‘పంచాయతీ’ (సమావేశం) పిలిచారు. ఈ సమయంలో, బీజేపీ నాయకురాలు భావనా, స్థానికుల మధ్య ఈ వివాదంపై మళ్లీ గొడవ చెలరేగింది. ఈ నేపథ్యంలో కొందరు వ్యక్తులు కర్రలతో భావనా, ఆమె కుటుంబ సభ్యులపై దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో అక్కడి సీసీకెమెరాల్లో రికార్డు అయ్యింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోలో కనీసం 10 నుంచి 12 మంది వ్యక్తులు తొలుత వాదులాడుకోవడం కనిపిస్తుంది. కొన్ని సెకన్ల తర్వాత ఒకరినొకరు తోసుకుంటూ కొట్టుకోవడం వీడియోలో చూడొచ్చు. ఓ వ్యక్తి కర్ర కూడా తీసుకొచ్చి దాడి చేసేందుకు యత్నించాడు. ఈ దాడిలో తన చేతికి గాయమైందని ఆమె ఆరోపించింది. వారిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్‌ చేసింది. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ సంఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని పోలీసులు తెలిపారు. ఫిర్యాదు స్వీకరించిన తర్వాత నిందితులపై చర్యలు తీసుకుంటామని అంకుర్ విహార్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఓ పోలీస్‌ అధికారి తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *