Viral News: చైనాలో కొత్త రకం ఉద్యోగం.. శవాలతో పది నిమిషాలు ఉంటే!

Viral News: చైనాలో కొత్త రకం ఉద్యోగం.. శవాలతో పది నిమిషాలు ఉంటే!


చైనా ఏది చేసినా వెరైటీగానే ఉంటుంది. జనాల దృష్టిని తమ వైపుకు తిప్పుకుంటారు. ఇలాగే తాజాగా చైనా వెల్లడించిన ఓ కొత్త ఉద్యోగం గురించి విని అందరూ షాక్ అవుతున్నారు. ఇలా కూడా చేస్తారా? అంటూ నోరెళ్ల బెడుతున్నారు. ప్రస్తుత ఈ న్యూస్ కాస్తా నెట్టింట జోరుగా వైరల్ అవుతుంది. ప్రస్తుత కాలంలో ఉద్యోగాలు దొరకడం ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఉద్యోగాల కోసం ఎంతో మంది ఆసరాగా ఎదురు చూస్తారు. ఈ క్రమంలోనే చైనా కొత్త రకం ఉద్యోగాలను విడుదల చేసింది. ఈ యాడ్ చదివి జనాలు షాక్ అవుతున్నారు. ఇదేం పరీక్షరా బాబూ అంటూ నోరెళ్ల బెడుతున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ చైనాలో ట్రెండింగ్‌లో ఉంది.

వివరాల్లోకి వెళ్తే.. చైనాలోని ప్రావిన్స్‌ ప్రాంతంలో ఓ మార్చురీలో ఉద్యోగానికి ఇటీవల ఓ యాడ్ రిలీజ్ అయ్యింది. ఈ జాబ్ మార్చురీలో ఉంటుంది. ఇక్కడ వరకూ బాగానే ఉన్నా.. మార్చురీలో జాబ్ చేయాలంటే అనేక టెస్టులు పెడుతున్నారు. గడ్డ కట్టే చలిలో శవాలతో పాటు పది నిమిషాలు ఉండాలంట. పైగా చిరాకు, విసుగు పడకూడదట. అంతే కాకుండా ఆరె నెలల పాటు అప్రెంటిస్‌షిప్ ఉంటుంది. 45 సంవత్సరాల వయసు ఉన్నవారు మాత్రమే ఈజాబ్‌కు అర్హులు. అంతే కాకుండా ఒక్కోసారి 24 గంటల పాటు డ్యూటీ కూడా చేయాల్సి ఉంటుందట. నెలకు రూ.25 వేల జీతం ఇస్తారట. ఈ ఆరు నెలల్లో ఎలాంటి పొరపాట్లు చేయకుండా ఉంటేనే జాబ్ గ్యారెంటీ. లేదంటే మాత్రం ఇంటికి వెళ్లాల్సిందే.

ప్రస్తుతం ఈ యాడ్ చూసిన జనాలు ఒకింత షాక్‌కి గురవుతున్నారు. మార్చురీలో జాబ్ చేయాలంటే ఇన్ని కఠిన పరీక్షలా.. అంత తక్కువ జీతానికి అంత ఎక్కువ శ్రమ పడాలా అంటూ అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుతం ఈ యాడ్.. నెట్టింట జోరుగా వైరల్ అవుతుంది. దీని పై నెటిజన్లు అనేక కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ లింక్ మీద క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *