వైరల్ అవుతున్న ఈ వీడియోను చూస్తే.. ఓ వ్యక్తి ఒక ఇంటి ముందు.. దారిలో నిలబడ్డాడు. అంతలోనే ఓ పెద్ద ఏనుగు వెనుక వైపు నుంచి వచ్చింది. అది గమనించని వ్యక్తి అలాగే అక్కడే నిలబడి ఉన్నాడు. దగ్గరి దాకా వచ్చిన ఏనుగు… అతడిని ఏమీ చేయలేదు. అలాగని ఎలాంటి శబ్దం కూడా చేసి భయపెట్టలేదు. సింపుల్ గా తన కాలితో కింద మట్టిని కాస్త ముందుకు తన్నింది. తన పక్కనుంచి మట్టి ఎగిసిపడటం చూసిన వ్యక్తి… ఇదేమిటా అని వెనక్కి తిరిగి చూశాడు. ఏనుగు కనబడటంతో భయపడి ఒక్కసారిగా పరుగు లంకించుకున్నాడు. ఆ ఏనుగు హాయిగా తన దారిన తాను వెళ్లిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను ఇప్పటికే ఐదు లక్షలమందికి పైగా వీక్షించారు. వేలాదిమంది లైక్స్‌తో కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. అడవిలో ఉండే ఏనుగు ఎంత పద్ధతిగా వ్యవహరించిందంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ‘ఆ ఏనుగు అతడిని భయపెట్టాలనుకోలేదు. కానీ తానే ఒక్కసారిగా భయపడ్డాడు…’ అంటూ కామెంట్లు చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.