స్తి కోసం మామను చెప్పుతో విచక్షణారహితంగా కొట్టిందో కోడలు. ఈ ఘటనపై తీవ్రంగా మండిపడుతున్నారు నెటిజన్లు.. నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలానికి చెందిన గక్కినెపల్లి బుచ్చిరెడ్డి, లక్ష్మమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు. ఉన్నంతలో వారిని పెంచి పెద్ద చేసి పెళ్లి చేశారు. తనకున్న తొమ్మిది ఎకరాల భూమిలో ఆరు ఎకరాలు ఇద్దరు కొడుకులకు ఇచ్చి మూడు ఎకరాలు తమ జీవనోపాధికి తమ వద్దే ఉంచుకున్నారు. ఇటీవల చిన్న కొడుకు దినేష్ రెడ్డికి మూడు ఎకరాల భూమిని బుచ్చిరెడ్డి రిజిస్ట్రేషన్ చేయించాడు. దీంతో వీరి మధ్య భూ వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలో తమకు తక్కువ భూమి ఇచ్చాడనే అక్కసుతో వృద్ధుడైన బుచ్చిరెడ్డిని పెద్దకోడలు ఇష్టం వచ్చినట్టు కొట్టింది. వీల్ చైర్ లో కూర్చుని ఉన్న అతన్ని చెప్పు తీసుకొని ముఖంపై దారుణంగా కొట్టింది. వృద్ధుడైన మామను.. కోడలు కొడుతుంటే వారి పెంపుడు కుక్క అడ్డుకునే ప్రయత్నం చేసింది. తన యజమానిని కొట్టవద్దంటూ ఆ మహిళ వద్దకు వెళ్లి అరుస్తూ వేడుకొంది. అయినా ఆ మహిళ ఆగలేదు. కొట్టవద్దని ఆ పెద్దాయన కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు. దాడి దృశ్యాలన్నీ అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. అ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.