ఓ వ్యక్తికి తాను ఇష్టపడిన యువతితో పెళ్లి జరిగింది. కట్ చేస్తే.. ఫస్ట్ నైట్ రోజున వధువు ఇచ్చిన పాలు తాగి ఆస్పత్రి పాలయ్యాడు ఆ వరుడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్‌లో చోటు చేసుకుంది. ఇంతకీ ఆ స్టోరీ ఏంటంటే.?
ఇది చదవండి: లాటరీతో లక్ వచ్చిందనుకున్నాడు.. కట్ చేస్తే.. కొద్దిరోజుల్లోనే ఊహించని సీన్
వివరాల్లోకి వెళ్తే.. ఛతర్‌పూర్‌లో నివాసముంటున్న 29 ఏళ్ల రాజ్‌దీప్ రావత్.. తను ఇష్టపడిన యువతి ఖుషీ తివారీని డిసెంబర్ 11న హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాతి రోజు ఇద్దరికి ఫస్ట్ నైట్ కావడంతో.. ఆ సమయంలో పాల గ్లాస్ తీసుకుని గదిలోకి వచ్చింది నవవధువు. ఆమె తీసుకొచ్చిన పాలు తాగి ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయాడు వరుడు. సీన్ కట్ చేస్తే.. తెల్లవారుజామున లేచి చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అతడి ఇంట్లో రూ. లక్ష విలువ చేసే వెండి, బంగారు ఆభరణాలు మాయం కావడమే కాదు.. వధువు కూడా అదృశ్యమైంది.
ఇవి కూడా చదవండి
దీంతో సదరు వ్యక్తి, అతడి తండ్రి ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వధువు, ఆమె సోదరుడు, సోదరుడి స్నేహితుడితో సహా నలుగురిపై కేసు నమోదు చేసి.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సదరు మహిళకు అంతకముందే రెండుసార్లు పెళ్లిళ్లు జరిగాయని.. ఈజీ మనీ కోసం ఆశపడి.. ఇలా నిత్య పెళ్లికూతురి అవతారం ఎత్తిందని స్థానికులు చెబుతున్నారు.
ఇది చదవండి: మీరు నిజంగానే తోపులైతే.. ఈ ఫోటోలో దాగున్న నెంబర్ కనిపెట్టగలరా.?
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి