Vinod Kambli: ‘నేను దేనికీ భయపడను’.. కపిల్ దేవ్ ఆఫర్‌ను అంగీకరించిన వినోద్ కాంబ్లీ

Vinod Kambli: ‘నేను దేనికీ భయపడను’.. కపిల్ దేవ్ ఆఫర్‌ను అంగీకరించిన వినోద్ కాంబ్లీ


భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లీ ప్రస్తుతం దీన స్థితిలో ఉన్నాడు. ఆరోగ్య సమస్యలతో పాటు ఆర్థికంగానూ ఎంతో ఇబ్బంది పడుతున్నాు. ఇటీవల ముంబైలో సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ ల గురువు రమాకాంత్ అచ్రేకర్ స్మారక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంబ్లి పాల్గొన్నాడు. అక్కడ అతని దీన స్థితిని చూసి క్రికెట్ అభిమానుల హృదయం తల్లడిల్లిపోయింది. ఈ క్రమంలోనే1983లో భారత్‌ను ప్రపంచకప్‌ ను అందించిన కపిల్ దేవ్ వినోద్ కాంబ్లీకి అన్ని విధాలుగా సహాయమందించేందుకు ముందుకొచ్చాడు. అయితే అందుకు ఆయన ముందు ఓ షరతు పెట్టారు. వినోద్ కాంబ్లీ మద్యపానం మానేస్తే నే ఆర్థికంగా సాయం చేస్తానని కండీషన్ పెట్టారు. కపిల్ దేవ్ ఇచ్చిన ఈ ఆఫర్‌ని వినోద్ కాంబ్లీ అంగీకరించారు. రిహాబిలిటేషన్ సెంటర్ కు వెళ్లడానికి రెడీగా ఉన్నానన్నాడు. 52 ఏళ్ల వినోద్ కాంబ్లీ ఇటీవల సోషల్ మీడియాలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు . అందులో కపిల్ దేవ్ ఆఫర్‌ను అంగీకరిస్తున్నట్లు తెలిపాడు. అలాగే కపిల్ దేవ్ చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపాడు. ‘నేను దేనికీ భయపడను. మద్యం మానివేయడానికి నేను పునరావాస కేంద్రానికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాను. నా కుటుంబం నాతోనే ఉంది.’ అని కాంబ్లీ చెప్పుకొచ్చాడు.

వినోద్ కాంబ్లీ గతంలో పలు సార్లు రిహాబిలిటేషన్ సెంటర్ కు వెళ్లొచ్చాడు. కానీ పెద్దగా ప్రయోజనం లేకపోయింది. ఇప్పుడు కపిల్ దేవ్ ఆఫర్‌ను అంగీకరించి మరోసారి అక్కడకు వెళతాన్నాడు కాంబ్లీ. ప్రస్తుతం తాను యూరిన్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశాడీ క్రికెటర్. ఈ కారణంగానే గత నెలలో స్పృహ కోల్పోయానన్నాడు. ప్రస్తుతం కాంబ్లీ బాగోగులను భార్య, కొడుకు, కూతురు చూస్తున్నారు. అయితే అతని కుటుంబ ఆర్థిక పరిస్థితి మరీ దారుణంగా మారింది. బీసీసీఐ ఇచ్చే రూ.30 వేల పెన్షన్‌తోనే కుటుంబాన్ని నడిపిస్తున్నాడు

ఇవి కూడా చదవండి

ఇదే ఇంటర్వ్యూలో కష్ట సమయాల్లో సచిన్ తనకు ఎంతో సహాయం చేశాడని కాంబ్లీ తెలిపాడు. ‘సచిన్ నాకు చాలా సహాయం చేసాడు. 2013లో లీలావతి హాస్పిటల్‌లో నాకు రెండు ఆపరేషన్లు జరిగాయి. సచిన్ సర్జరీ ఖర్చులన్నీ భరించాడు. నా ప్రయాణం సరిగా లేదు. సచిన్ సహాయానికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని కాంబ్లీ చెప్పుకొచ్చాడు.

సచిన్ ఎంతో చేశాడు..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *