భారతదేశంలో మీరు కొత్త వాహనాన్ని కొనుగోలు చేసినప్పుడల్లా అది రవాణా శాఖ ద్వారా నమోదు చేయబడుతుంది. బదులుగా డిపార్ట్మెంట్ మీ వాహనానికి తెలుపు రంగులో ఉండే నంబర్ ప్లేట్‌ను జారీ చేస్తుంది. కానీ, మీ వాహనం కొనుగోలు చేసే ఉద్దేశ్యం వేరేది అయితే, మీ వాహనం నంబర్ ప్లేట్ రంగు కూడా మారుతుంది. మీరు నలుపు, నీలం, ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, తెలుపు రంగులలో ఈ నంబర్ ప్లేట్లను ఉండటం చూసే ఉంటారు. ఈ కలర్స్ నంబర్ ప్లేట్ల అర్థం ఏమిటో తెలుసా? భారతదేశంలో ఉపయోగించే వివిధ రంగుల నంబర్ ప్లేట్ల గురించి తెలుసుకుందాం..
ఇండియన్ ఎంబ్లెమ్ ఉండే రెడ్ నంబర్ ప్లేట్లు: భారత ప్రభుత్వ చిహ్నం ఉండే ఎరుపు రంగు నంబర్ ప్లేట్లను కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాల వాహనాలకు ఉపయోగిస్తారు. వీటిని ఉన్నత స్థాయి అధికారులు, ప్రముఖులు వాడేందుకు అనుమతి ఉంటుంది.
రెడ్ నంబర్ ప్లేట్లు: ఈ రెడ్ కలర్ నంబర్ ప్లేట్ టెంపరరీ వెహికల్స్‌కు మాత్రమే ఉంటాయి. వీటిని టెస్టింగ్ కోసం ఉపయోగిస్తారు. అధికారికంగా రిజిస్ట్రేషన్ కాని వాహనాలకు ఈ కలర్ నంబర్ ప్లేట్లను కేటాయిస్తారు.
బాణం గుర్తు ఉన్న నంబర్ ప్లేట్లు: ఇక కొన్ని వాహనాలకు బాణం గుర్తుతో ఉన్న నంబర్ ప్లేట్లు ఉండటం చూసే ఉంటాము. ఇవి సైన్యం, ఆర్మీ, అలాగే నేవీ సాయుధ దళాలకు చెందిన వాహనాలకు ఉంటుంది. వీటిని రక్షణ శాఖ జారీ చేస్తుంది. ఈ కలర్ నంబర్ ప్లేట్లు ఉన్న వాహనాలకు ఎలాంటి ట్రాఫిక్ రూల్స్ ఉండవు. ట్రాఫిక్ నిబంధనల నుంచి మినహాయింపు ఉంటుంది. స్పెషల్ లేన్స్ లేదా రూట్లకు యాక్సెస్ మంజూరు చేస్తారు.
బ్లూ నంబర్ ప్లేట్లు: విదేశీ దౌత్యవేత్తలు, రాయబార కార్యాలయాలు లేదా కాన్సులేట్లకు చెందిన వాహనాలకు ఈ బ్లూ కలర్ నంబర్ ప్లేట్లు ఉంటాయి. ఈ నంబర్ ప్లేట్లను విదేశాంగ శాఖ జారీ చేస్తుంది. దౌత్యవేత్త దేశ లోగో లేదా చిహ్నంతో పాటు తెలుపు అక్షరాలు, సంఖ్యలు వీటిపై ఉంటాయి.
బ్లాక్ నంబర్ ప్లేట్లు: ఈ బ్లాక్ నంబర్ ప్లేట్ ఉన్న వాహనాలు సెల్ఫ్ డ్రివెన్ రెంటర్ కమర్షియల్ వెహికల్స్‌కు ఉంటాయి. వీటిని వాణిజ్య అవసరాల కోసమే ప్రత్యేకంగా కేటాయిస్తారు. ఈ వాహనాలు పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి.
గ్రీన్ నంబర్ ప్లేట్లు: ఎలక్ట్రిక్ వాహనాలకు గ్రీన్ నంబర్ ప్లేట్లను మంజూరు చేస్తారు. వాహనం రకంతో సంబంధం లేకుండా, అన్ని ఎలక్ట్రిక్ వాహనాలకు ఈ నంబర్ ప్లేట్లను కేటాయిస్తారు అధికారులు. ఈ ప్లేట్‌పై అక్షరాలు, కోడ్ తెలుపు రంగులో ఉంటాయి.
తెలుపు నంబర్ ప్లేట్: వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేట్లు ఎక్కువగా తెలుపు రంగు నంబర్ ప్లేట్లను వాడతారు. ఇవి నాన్-కమర్షియల్ ప్రైవేట్ వెహికల్స్‌కు మాత్రమే ఉంటాయి. ఈ నంబర్ ప్లేట్లపై అక్షరాలు రాష్ట్ర కోడ్, జిల్లా కోడ్, వాహన యూనిక్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను సూచిస్తాయి.
పసుపు రంగు నంబర్ ప్లేట్లు: టాక్సీలు, బస్సులు, ట్రక్కులు వంటి కమర్షియల్ వెహికల్స్ నంబర్ ప్లేట్లు పసుపు రంగులో ఉంటాయి. వీటిపై అక్షరాలు, సంఖ్యలు నలుపు రంగుతో ఉంటాయి. వీటిపై వైట్ ప్లేట్స్ మాదిరిగానే రాష్ట్రం, జిల్లా కోడ్‌ను సూచించే నంబర్స్ ఉంటాయి.