Vaikunta Ekadasi 2025: 2025 సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి ఎప్పుడు? తేదీ, పూజా విధానం తెలుసుకోండి..

Vaikunta Ekadasi 2025: 2025 సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి ఎప్పుడు? తేదీ, పూజా విధానం తెలుసుకోండి..


హిందూ మతంలో వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున శ్రీ మహా విష్ణువును, లక్ష్మీదేవిని పూజించే సంప్రదాయం ఉంది. అంతేకాదు వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని కూడా ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల విష్ణులోకంలో స్థానం లభిస్తుందని మత విశ్వాసం. అలాగే వ్యక్తి జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందుతాడు. పురాణ మత గ్రంధాల ప్రకారం వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ లోక ప్రధాన ద్వారం తెరిచి ఉంటుంది.

వేద పంచాంగం ప్రకారం ఈ పండుగ సూర్యభగవానుడు ధనుస్సు రాశిలో సంచరించే సమయంలో వస్తుంది. పుష్య మాసంలోని శుక్ల పక్షంలోని ఏకాదశిని పుష్య పుత్రాద ఏకాదశి రోజుగా లేదా వైకుంఠ ఎకాదశిగా జరుపుకుంటారు. వైకుంఠ ఏకాదశి తిథి రోజున శ్రీ హరిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. అటువంటి పరిస్థితిలో 2025 సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి ఎప్పుడు? పూజించే విధానం ఏమిటో తెలుసుకుందాం.

2025లో వైంకుఠ ఏకాదశి ఎప్పుడంటే

వైద క్యాలెండర్ ప్రకారం పుష్య మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి తిథి జనవరి 9 మధ్యాహ్నం 12:22 గంటలకు ప్రారంభమవుతుంది. అదే సమయంలో ఈ ఏకాదశి తిథి జనవరి 10 ఉదయం 10:19 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో ఉదయ తిథి ప్రకారం జనవరి 10న వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

వైంకుఠ ఏకాదశి 2025 వ్రత పారణ సమయం

జనవరి 10వ తేదీ శుక్రవారం రోజున వైకుంఠ ఏకాదశి ఉపవాసం చేయాల్సి ఉంటుంది. ఈ రోజున ఆచారాల ప్రకారం విష్ణువు, లక్ష్మీ దేవిని పూజించండి. సాయంత్రం సమయంలో హారతి ఇచ్చి అనంతరం పండ్లు తీసుకోవాలి. రాత్రి జాగరణ చేస్తూ శ్రీ మహా విష్ణువుని పూజించాలి. మర్నాడు ద్వాదశి రోజున యధావిధిగా పూజ చేసి ఉపవాసాన్ని విరమించండి. ఉపవాసం విరమించిన తర్వాత బ్రాహ్మణులకు దానం చేయాలి. వైకుంఠ ఏకాదశి ఉపవాసాన్ని జనవరి 11న ఉదయం 07:21 నుంచి 8:21 వరకు విరమించవచ్చు.

వైకుంఠ ఏకాదశి పూజ విధి

  1. వైకుంఠ ఏకాదశి రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్ర మేల్కొనండి
  2. నిద్రలేచి తర్వాత విష్ణుమూర్తిని ధ్యానిస్తూ రోజును ప్రారంభించండి.
  3. ఆ తర్వాత ఇంటిని శుభ్రం చేసి గంగాజలం చల్లాలి.
  4. తర్వాత సాధారణ నీటిలో గంగాజలం కలుపుకుని స్నానం చేయాలి.
  5. తర్వాత పసుపు రంగు దుస్తులు ధరించండి.
  6. దీని తరువాత ఒక రాగి పాత్ర తీసుకుని నీటిలో పసుపు కుంకుమ అక్షతలు వేసి సూర్య భగవానుడికి నీటిని అర్ఘ్యంగా సమర్పించండి.
  7. పంచోపచారాలు చేసిన తర్వాత విష్ణువును పూజించండి.
  8. పూజ సమయంలో విష్ణువుకు పండ్లు, పువ్వులు మొదలైనవి సమర్పించండి.
  9. పూజ ముగింపులో హారతి ఇచ్చి ఇంట్లో సుఖసంతోషాలు, శ్రేయస్సు కోసం ప్రార్థించండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *