Unstoppable With NBK : సందడే సందడి..! బాలయ్య షోకు వెంకీ మామ.. ఇది కదా మజా అంటే

Unstoppable With NBK : సందడే సందడి..! బాలయ్య షోకు వెంకీ మామ.. ఇది కదా మజా అంటే


ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా.. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు, అదిరిపోయే వెబ్ సిరీస్ లు అందుబాటులో ఉన్నాయి. అలాగే అదిరిపోయే టాక్ షోలు, ఆకట్టుకునే గేమ్ షోలు, సింగింగ్ షోలతో ప్రేక్షకులను అలరిస్తోంది ఆహా.. అలాగే ఆహాలో అదరగొట్టిన టాక్ షో అన్‌స్టాపబుల్. ఈ టాక్ షో ఎంత సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నందమూరి నటసింహం బాలకృష్ణ ఈ టాక్ షోతో మొదటి సారి హోస్ట్ గా కనిపించారు. అన్‌స్టాపబుల్ షోను బాలయ్య అద్భుతంగా నడిపిస్తున్నారు. తన ఎనర్జీతో అభిమానులకు డబుల్ కిక్ ఇస్తున్నారు నటసింహం. ఇప్పటికే ఈ టాక్ షో మూడు సీజన్స్ ను పూర్తి చేసుకొని ఇప్పుడు నాలుగో సీజన్ లోకి అడుగు పెట్టింది. ఈ నాలుగో సీజన్ లో చాలా మంది స్టార్ గెస్ట్ లుగా హాజరయ్యారు.

ఇది కూడా చదవండి :ప్రియుడితో కలిసి చిందులేసిన క్రేజీ బ్యూటీ.. కుళ్ళుకుంటున్న కుర్రాళ్ళు..

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ టాక్ షోకి విక్టరీ వెంకటేష్ గెస్ట్ గా హాజరు కానున్నారు. మొదటిసారిగా  వెంకటేష్ బాలకృష్ణ అన్‌స్టాపబుల్‌తో టాక్ షోకు హాజరుకానున్నారు. వెంకటేష్ పాల్గొనే ఎపిసోడ్ డిసెంబర్ 22, 2024న షూటింగ్ జరుపుకోనుంది. మామూలుగానే వెంకటేష్ టాక్ షోలకు తక్కువ హాజరుఅవుతారు. ఇప్పుడు బాలయ్య షోకు వస్తున్నారనగానే అభిమానుల్లో ఉత్సహం రెట్టింపు అయ్యింది. ఈ ఇద్దరి మధ్య ఎలాంటి సంభాషణలు జరుగుతాయో చూడాలి. ‘బాలకృష్ణ వేసే చిలిపి ప్రశ్నలకు వెంకటేష్ ఎలాంటి ఆన్సర్స్ ఇస్తారో చూడాలి.

ఇది కూడా చదవండి :Year Ender 2024: రేయ్ ఎవర్రా మీరంతా..!! ఈ హీరోయిన్ కోసం గూగుల్‌లో తెగ గాలించారంట మావా..

వెంకటేష్ హీరోగా నటిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ విశేషాలను కూడా వెంకటేష్ ఈ ఎపిసోడ్ లో మాట్లాడనున్నారు. ఇద్దరి మధ్య ఎలాంటి సరదా సంభాషణలు జరుగుతాయో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. నందమూరి బాలకృష్ణ, వెంకటేష్ మధ్య ప్రత్యేక సంభాషణను అస్సలు మిస్ చేసుకోకండి. ఆహా OTT ప్లాట్‌ఫారమ్‌లో అన్‌స్టాపబుల్ సీజన్ 4 ఏడవ ఎపిసోడ్‌ కోసం ఆహాను చూస్తూనే ఉండండి.

ఇది కూడా చదవండి : OTT Web Series : ఓయమ్మో..! ఇదెక్కడి అరాచకం.. మరీ ఇంత బోల్డ్ సిరీసా..!! ఒంటరిగానే చూడాలి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *