నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న నంబర్ వన్ టాక్ షో అన్‌స్టాపబుల్ విత్ ఎన్ బీకే. ఇప్పటికే ఈ సెలబ్రిటీ టాక్ షో సక్సెస్ ఫుల్ గా మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నాలుగో సీజన్ కూడా విజయవంతంగా రన్ అవుతోంది. ఇప్పటికే ఆరు ఎపిసోడ్స్ కూడా పూర్తయ్యాయి. మొదటి ఎపిసోడ్‌కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, రెండో ఎపిసోడ్‌కు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, మూడో ఎపిసోడ్‌కు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, నాలుగు, ఐదో ఎపిసోడ్స్ కు అల్లు అర్జున్, ఆరో ఎపిసోడ్ కు కిస్సిక్ బ్యూటీ శ్రీలీల, జాతి రత్నం నవీన్ పొలిశెట్టి అతిథులుగా వచ్చారు. ఇక ఏడో ఎపిసోడ్ కు విక్టరీ వెంకటేష్ గెస్టుగా రానున్నారు. బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోకు వెంకీ రావడం ఇ దే మొదటిసారి. ఈ ఎపిసోడ్ షూటింగ్ ఆదివారం (డిసెంబర్ 22) ప్రారంభమైంది. కాగా వెంకటేష్ తో పాటు సంక్రాంతికి వస్తున్నాం ఫేమ్ అనిల్ రావిపూడి, మీనాక్షి చౌదరి కూడా బాలయ్య షోకు వచ్చారు. తమ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇక్కడకు వచ్చి సందడి చేశారు వెంకటేష్. ఇప్పటికే ఈ ఎపిసోడ్ షూటింగ్ నుంచి ఫొటోలు రిలీజ్ చేశారు మేకర్స్. తాజాగా ఈ ఎపిసోడ్ చిన్న గ్లింప్స్ రిలీజ్ చేయడంతో స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేశారు. ఈ గ్లింప్స్ లో.. వెంకటేష్ రాగా బాలయ్య వెల్కమ్ చెప్పారు. వెంకటేష్ తొడకొడితే, బాలయ్య వెంకీ ఆసనం వేసి ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేశారు. ఇక ఈ ఎపిసోడ్ ని డిసెంబర్ 27న రాత్రి 7 గంటలకు స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు ఆహా మేకర్స్.
ఇవి కూడా చదవండి
ఒకే వేదికపై సంక్రాంతి హీరోలు..
కాగా ఈ సారి సంక్రాంతికి బాలకృష్ణ, వెంకటేష్ సినిమాలు రాబోతున్నాయి. బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న డాకూ మహారాజ్, విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు సంక్రాంతి బరిలో దిగనున్నాయి. ఇప్పటికే ఈ సినిమాల నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ అంచనాలను పెంచేశాయి. ఇప్పుడీ సంక్రాంతి హీరోలు అన్ స్టాపబుల్ షో వేదిపై సందడి చేయనున్నారు. అంటే సంక్రాంతి కంటే ముందే మనల్ని ఎంటర్ టైన్ చేయనున్నారన్నమాట.
బాలయ్య అన్ స్టాపబుల్ లో వెంకీ మామ..
Victory and the God of Masses together 🔥🔥🔥 Sankranti heroes, unstoppable energy, and ultimate entertainment.#UnstoppableWithNBKS4 #Aha #NandamuriBalakrishna #VenkateshDaggubati #aha #UnstoppableS4 #NBK #Sankranthi @VenkyMama pic.twitter.com/fqvT2xlse7
— ahavideoin (@ahavideoIN) December 22, 2024
అన్ స్టాపబుల్ ఎపిసోడ్ సెవెన్ గ్లింప్స్..