ఇటీవల పాన్ ఇండియా లెవల్లో చిన్న సినిమాలు సైతం సత్తా చాటుతున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. ఈ జాబితాలో ఎక్కువగా దక్షిణాది చిత్రాలు ఉండడం విశేషం. స్టార్ హీరోహీరోయిన్స్ లేకపోయినా కంటెంట్ నచ్చితే చాలు బ్రహ్మారథం పడుతున్నారు జనాలు. అయితే కొన్ని సినిమాలు అద్భుతంగా మెప్పిస్తున్నాయి. మరికొన్ని మాత్రం అట్టర్ ప్లాప్ అవుతున్నాయి. భారీ బడ్జెట్ ఉన్నా సరే కంటెంట్ లో దమ్ము లేకపోతే ప్రేక్షకులను ఆకట్టుకోవడం కష్టమే అని కొన్ని సినిమాలు నిరూపించాయి. భారీ తారాగణం, భారీ బడ్జెట్ తో రూపొందించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. 1991లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాల్లో సడక్ ఒకటి. మహేశ్ భట్ దర్శకత్వంలో సంజయ్ దత్, పూజా భట్ నటించిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ సినిమా రిలీజ్ అయిన రెండు దశాబ్దాల తర్వాత సీక్వెల్ ప్రకటించారు. సంజయ్ దత్, అలియా భట్, ఆదిత్య రాయ్ కపూర్ ప్రధాన పాత్రలలో నటించిచన ఈ చిత్రాన్ని 2020లో విడుదల చేశారు. అయితే సడక్ సినిమా భారీ విజయాన్ని సాధిస్తే.. ఈమూవీ సీక్వెల్ సడక్ 2 మాత్రం భారీ డిజాస్టర్ అయ్యింది. యూట్యూబ్ లో ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోనే 70 లక్షల మంది డిస్ లైక్ కొట్టారు. ఇక సినిమాకు థియేటర్లు కూడా దొరకలేదు. దీంతో తప్పక ఈ చిత్రాన్ని హాట్ స్టార్ లో రిలీజ్ చేశారు.
ఈ మూవీ IMDBలో అత్యంత దారుణమైన రేటింగ్స్ వచ్చాయి. కేవలం 1.2 రేటింగ్ ఉంది. ఓటీటీలో విడుదలైన రెండు రోజులకే సడక్ 2 సినిమా వంద అత్యంత చెత్త చిత్రాలల్లో ఒకటిగా చేరిపోయింది. సడక్ సినిమా విడుదలైన అదే సంవత్సరం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించారు. బాలీవుడ్ ఇండస్ట్రీలోని నెపోటిజమే అతడి ప్రాణాలు తీసిందని అప్పట్లో బాయ్ కాట్ బాలీవుడ్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయ్యింది. దీంతో కొన్నేళ్లుగా బాలీవుడ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యాయి.
ఇవి కూడా చదవండి
ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‌బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..
Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‌గా..
Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..
Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‌ను మించిన అందం.. ఎవరంటే..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.