సునీల్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ‘మర్యాద రామన్న’. 2010లో విడుదలైన ఈ ఫ్యామిలీ కామెడీ యాక్షన్ డ్రామా లో సలోని హీరోయిన్ గా నటించింది. అలాగే నాగినీడు, సుప్రీత్, ప్రభాకర్, బ్రహ్మాజీ, రావు రమేష్, చత్రపతి శేఖర్.. ఇలా భారీ తారగణం ఇందులో కనిపించింది. ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగే ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ను బాగా మెప్పించింది. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోగా వెలుగొందుతున్న ఒక నటుడు ఇదే మర్యాద రామన్న సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించాడు. పై ఫొటోలో సునీల్ పక్కనున్నది అతనే. సినిమాలో సునీల్ కు నాగినీడు ఇంటికి దారిచూపే రాయలసీమ కుర్రాడు ఓబులేశ్ పాత్రలో కొద్ది సేపు అలా కనిపిస్తాడీ టాలీవుడ్ క్రేజీ హీరో. మరి అతనెవరో గుర్తు పట్టారా? మర్యాద రామన్నతో పాటు పలు సినిమాల్లో ఛైల్డ్ ఆర్టిస్టుగా కనిపించిన ఆ హీరో ఇటీవలే ఓ బ్లాక్ బస్టర్ మూవీ ఖాతాలో వేసుకున్నాడు. ఇంకో విశేషమేమిటంటే.. ఆ క్రేజీ హీరో ఇటీవలే పెళ్లి పీటలెక్కాడు. అది కూడా మురళి మోహన్ మనవరాలితో. యస్.. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? ఆ కుర్రాడు మరెవరో కాదు మత్తు వదలరా సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన శ్రీ సింహా కోడూరి.
రాజమౌళి అన్నగారైన కీరవాణి కుమారుడు శ్రీ సింహా ఛైల్డ్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించాడు. విక్రమార్కుడు లో మార్వాడి పెళ్లి ఇంట్లో చాలా మంది పిల్లలు అల్లరి చేస్తుంటార. అందులో శ్రీసింహా కూడా ఉంటాడు. ఆ తరువాత ఎన్టీఆర్ హీరోగా వచ్చిన యమదొంగ చిత్రంలో ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్ర చేసింది శ్రీ సింహనే. మర్యాద రామన్న సినిమాలోనూ మెరుస్తాడు. అయితే అతను శ్రీ సింహా అన్నది వెంటనే గుర్తుపట్టలేం.
మత్తు వదలరా 2 సినిమాలో శ్రీ సింహా..
ఇక మత్తు వదలరా సినిమాలో సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన శ్రీ సింహా ఆ తర్వాత తెల్లవారితే గురువారం, ఉస్తాద్, భాగ్ సాలే సినిమాల్లోనూ కథానాయకుడిగా మెరిశాడు. ఇటీవలే మత్తు వదలరా 2 తో సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు వైవాహిక బంధంలోనూ అడుగు పెట్టాడు.
రాజమౌళి, సోదరుడు కాల భైరవతో శ్రీ సింహా..
.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.