Tollywood: ప్రొఫెషనల్ బాక్సర్ అవ్వాల్సింది.. అనుకోకుండా స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?

Tollywood: ప్రొఫెషనల్ బాక్సర్ అవ్వాల్సింది.. అనుకోకుండా స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?


పై ఫొటోలో క్యూట్ గా కనిపిస్తోన్న అమ్మాయిని గుర్తుపట్టారా? ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయిన్. తెలుగు, తమిళ్ తో పాటు హిందీ సినిమాల్లోనూ నటించింది. అందం, అభినయం పరంగా సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సిల్వర్ స్క్రీన్‌ పై తన యాక్టింగ్ తో ఇరగదీసే ఈ అందాల తారలో ఇంకో ట్యాలెంట్ ఉంది. ఓర చూపులతో కల్వించే ఈ క్రేజీ హీరోయిన్ మంచి కిక్ బాక్సర్ కూడా. తండ్రి అడుగు జాడల్లోనే నడుస్తూ చిన్నతనం నుంచే మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ తీసుకుంది. పెద్దయ్యాక పలు బాక్సింగ్ లీగ్స్‌లో పాల్గొని విజేతగానూ నిలిచింది. అయితే తానొకటి తలిస్తే.. దైవం మరోటి తలచిందని.. గొప్ ప్రొఫెషనల్ కిక్ బాక్సర్ గా ఎదగాల్సిన ఈ అమ్మాయి అనూహ్యంగా హీరోయిన్ గా మారిపోయింది. మరి ఈ క్యూటీ ఎవరో గుర్తు పట్టారా? తను మరెవరో కాదు గురు సినిమాలో విక్టరీ వెంకటేశ్‌తో కలిసి నటించిన రితికా సింగ్. ఇది ఆమె చిన్నప్పటి ఫొటో. ఇటీవలే తన పుట్టిన రోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందీ అందాల తార. ఈ నేపథ్యంలో రితికకు సంబంధించిన చిన్ననాటి, అరుదైన ఫొటోలు తెగ చక్కర్లు కొడుతున్నాయి.

చిన్నప్పటి నుంచి కిక్ బాక్సింగ్ లో శిక్షణ తీసుకున్న రితికా సింగ్ బాక్సింగ్ నేపథ్య కథతో తీసిన ‘సాలా ఖదూస్’ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇదే సినిమా తమిళంలో ఇరుడి సుట్రు పేరుతో రీమేక్ అయ్యింది. ఇది కూడా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత ఇదే కథతో తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా గురు పేరుతో తెరకెక్కించారు దర్శకురాలు సుధా కొంగర. అన్ని భాషల్లో హీరో మారినా రితికా సింగ్ నే హీరోయిన్ గా నటించడం విశేషం. దీని తర్వాత విజయ్ సేతుపతి‌తో కలిసి ఆండవన్ కట్టలై, అలాగే రాఘవ లారెన్స్ సరసన శివలింగ సినిమాల్లో నటించింది రితిక. ఈ రెండు చిత్రాలు కూడా హిట్ గా నిలిచాయి.

ఇవి కూడా చదవండి

రితికా సింగ్ లేటెస్ట్ ఫొటోస్..

గురు తర్వాత నేరుగా మరే తెలుగు సినిమాలోనూ నటించలేదు రితిక. కేవలం నీవెవ్వరో అనే సినిమాలో కనిపించింది. ఇక ఈ ముద్దుగుమ్మ చివరిగా రజనీకాంత్ వెట్టయాన్ సినిమాలో నటించింది. ఇందులో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా ఆకట్టుకుందీ అందాల తార. సినిమాల సంగతి పక్కన పెడితే.. రితిక సోషల్ మీడియలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ చేసే వర్కౌట్లకు అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యపోతుంటారు.

జిమ్ లో రితికా సింగ్ వర్కౌట్స్

.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *