Tollywood: చదివిందేమో డాక్టర్.. సినిమాల్లో హాట్ యాక్టర్.. ఈ అమ్మడు ఎవరో తెల్సా

Tollywood: చదివిందేమో డాక్టర్.. సినిమాల్లో హాట్ యాక్టర్.. ఈ అమ్మడు ఎవరో తెల్సా


ఈ మధ్యకాలంలో హీరోయిన్లు గ్లామర్ రోల్స్‌కి మాత్రమే కాదు.. డీ గ్లామరైజ్డ్ రోల్స్‌కి సైతం ఓకే చెబుతున్నారు. స్టార్ హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకోవాలంటే.. అన్ని పాత్రలకు సై అనాల్సిందే. ఇక ఈ కోవకు చెందిన భామ కామాక్షి భాస్కర్ల. తన కెరీర్‌‌లో ఎక్కువగా డీ-గ్లామర్ రోల్స్ చేసింది ఈ అమ్మడు. అలాగే ఆ పాత్రలతో అవార్డు సైతం అందుకుంది. తెరపై డీ-గ్లామర్, రగ్గ్‌డ్‌ క్యారెక్టర్లలో కనిపించి.. సోషల్ మీడియాలో మాత్రం సెగలు పుట్టిస్తోంది ఈ చిన్నది.

చైనాలో డాక్టర్ డిగ్రీ పట్టా అందుకుని.. అపోలో హాస్పిటల్‌లో కొంతకాలం డాక్టర్‌గా పని చేసింది ఈ అందాలభామ. 2018లో మిస్ తెలంగాణగా టైటిల్ గెలుచుకుంది. ఆ తర్వాత ఈమెకు వరుసగా సినిమా ఛాన్స్‌లు వచ్చాయి. ‘ప్రియురాలు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ‘మా ఊరి పొలిమేర’, ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’, ‘విరూపాక్ష’, ‘పొలిమేర 2’, ‘ఓం భీమ్ బుష్’ వంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో కనిపించింది. మా ఊరి పొలిమేర, పొలిమేర 2 మూవీస్ అయితే ఈ బ్యూటీకి మంచి పేరు తెచ్చిపెట్టాయి. మరోవైపు ‘ఝాన్సీ’, ‘సైతాన్’, ‘దూత’ లాంటి వెబ్ సిరీస్‌ల్లోనూ నటించింది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలతో కుర్రాళ్లకు సెగలు పుట్టిస్తోంది ఈ అమ్మడు. లేట్ ఎందుకు మీరూ ఆ ఫోటోలపై ఓ లుక్కేయండి.

ఇది చదవండి: అబ్బబ్బో అరాచకం.. బోల్డ్ సిరీస్‌తో కవ్వించిన ఈ టాలీవుడ్ భామ ఎవరో తెల్సా





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *