Tollywood: అయ్య బాబోయ్.. అందాల అరాచకం ఈ అమ్మాయి.. దేవుళ్లు చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు చూస్తే..

Tollywood: అయ్య బాబోయ్.. అందాల అరాచకం ఈ అమ్మాయి.. దేవుళ్లు చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు చూస్తే..


దివంగత డైరెక్టర్ కోడి రామకృష్ణ తెరకెక్కించిన అద్భుతమైన చిత్రాల్లో దేవుళ్లు ఒకటి. 2000లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై సినీప్రియులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇద్దరు చిన్న పిల్లలతో ఈ సినిమా కథ మొత్తం నడిపించారు. దేవుళ్లు చిత్రంలో పృథ్వీరాజ్, రాశి ప్రధాన పాత్రలు పోషించగా.. మాస్టర్ నందన్, బేబీ నిత్య కీలకపాత్రలు పోషించారు. తల్లిదండ్రులను కలిపేందుకు ఈ ఇద్దరు చిన్నారులు ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరగడం.. చివరకు ఎలా తమ తల్లిదండ్రులను ఒక్కటి చేశారు అన్నది ఈ సినిమా. అప్పట్లో ఈ సినిమాలోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయ్యాయి.

ఈ చిత్రంలో కనిపించిన చిన్నారి నిత్యా శెట్టి ఇప్పుడు సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. తన అందంతో కుర్రకారును కట్టిపడేస్తుంది. అప్పుడు చైల్డ్ ఆర్టిస్టుగా క్యూట్ గా కనిపించిన నిత్యా శెట్టి.. ఇప్పుడు నెట్టింట గ్లామర్ ఫోజులతో అగ్గిరాజేస్తుంది. బాలనటిగా తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత చదువుల దృష్ట్యా సినిమాలకు దూరంగా ఉండిపోయిన నిత్యా.. ఇప్పుడు నటనపై ఆసక్తితో మళ్లీ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చింది.

నువ్వు తోపురా.. పిట్టకథ, వాంటెడ్ పండుగాడు వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ ఇప్పటివరకు ఈ అమ్మడుకు సరైన బ్రేక్ రాలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మాయి చాలా యాక్టివ్. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. అప్పట్లో దేవుళ్లు సినిమాతో అలరించిన చిన్నారి.. ఇప్పుడు హీరోయిన్ లా మారిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‏బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..

Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‏గా..

Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..

Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‏ను మించిన అందం.. ఎవరంటే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *