The Raja Saab Movie: ప్రభాస్ ‘ది రాజా సాబ్’ సినిమాపై ఆ రూమర్లు.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన మేకర్స్

The Raja Saab Movie: ప్రభాస్ ‘ది రాజా సాబ్’ సినిమాపై ఆ రూమర్లు.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన మేకర్స్


కల్కి తర్వాత పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న చిత్రం ది రాజా సాబ్. మారుతి తెరకెక్కిస్తోన్న ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ లో నిధి అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రభాస్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ది రాజా సాబ్ వచ్చే ఏడాది 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని ఇది వరకే అధికారికంగా ప్రకటించారు మేకర్స్. అయితే గత కొన్ని రోజులుగా ప్రభాస్ సినిమా రిలీజ్ వాయిదా పడనుందనే ప్రచారం జరుగుతోంది. ప్రభాస్ కు గాయం కావడమే దీనికి కారణమని రూమర్లు వినిపిస్తున్నాయి. దీనికి తోడు 2025న ఏప్రిల్ 10న సిద్ధు జొన్నలగడ్డ మూవీ జాక్ ను రిలీజ్ చేస్తున్నట్లు కాసేపటి క్రితమే ప్రకటించారు. దీంతో ది రాజా సాబ్ కచ్చితంగా వాయిదా పడనుందన్న ప్రచారం ఊపందుకుంది. ఇది ప్రభాస్ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. తాజాగా ఈ వార్తలపై ది రాజాసాబ్‌ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ స్పందించింది. ది రాజాసాబ్ ‍విషయంలో వస్తోన్న రూమర్లను నమ్మవద్దని సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన వెలువరించింది.

‘‘ది రాజాసాబ్‌’ సినిమా షూటింగ్ పగలు, రాత్రి తేడా లేకుండా శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే దాదాపు 80 శాతం షూటింగ్‌ పూర్తయింది. పోస్ట్‌ ప్రొడక్షన్స్‌ కార్యక్రమాలు అంతే స్పీడ్ గా జరుగుతున్నాయి. క్రిస్మస్‌కుగానీ, న్యూ ఇయర్‌కుగానీ ఈ మూవీ టీజర్‌ రిలీజ్‌ కానుందన్న రూమర్స్‌ మా దృష్టికి వచ్చాయి. అయితే అసత్య ప్రచారాలను నమ్మవద్దని ప్రేక్షకులు, అభిమానులకు రిక్వెస్ట్ చేస్తున్నాం. సమయం వచ్చినప్పుడు అప్‌డేట్స్‌ను మేమే అధికారికంగా ప్రకటిస్తాం. మీ అందరినీ కట్టిపడేసే టీజర్‌ త్వరలోనే వస్తుంది’ అని ప్రకటనలో తెలిపింది ది రాజా సాబ్ టీమ్. దీంతో ప్రభాస్ సినిమా రిలీజ్ పై వస్తున్న రూమర్లకు చెక్ పడింది.

ఇవి కూడా చదవండి

ది రాజా సాబ్ టీమ్ ట్వీట్..

ది రాజా సాబ్ లో ప్రభాస్ న్యూ లుక్..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *