Thanka Anki: ఏడాదికి ఒకసారే తంగా అంగీ యాత్ర.. మండల పూజకు ముందు జరిగే ఈ ఊరేగింపు గురించి తెలుసా..

Thanka Anki: ఏడాదికి ఒకసారే తంగా అంగీ యాత్ర.. మండల పూజకు ముందు జరిగే ఈ ఊరేగింపు గురించి తెలుసా..


శబరిమలలో నిర్వహించే మండలపూజ కోసం ఉపయోగించే ‘థంక అంగీ ఊరేగింపు అయ్యప్ప భక్తులకు చాలా ముఖ్యమైనది. శబరిమల పుణ్యక్షేత్రంలో కొలువైన అయ్యప్ప విగ్రహానికి అలంకరించే పవిత్ర బంగారు వస్త్రం ఈ థంక అంగీ . 1973లో ట్రావెన్‌కోర్ సంస్థానానికి ఆఖరి పాలకుడు శ్రీ చితిర తిరునాళ్ బలరామవర్మ సమర్పించారు. చితిర తిరునాళ్ అయ్యప్పన్‌కు 400 కిలోల కంటే ఎక్కువ బరువున్న థంక వస్త్రాన్ని సమర్పించారు. శ్రీ చితిర తిరునాళ్ చేత అంకితం చేయబడిన థంక అంగీ లో అయ్యన్ కిరీటంలో బంగారు పీఠం ఉంటుంది. తంకా వస్త్రంలో పీఠం, పాదుకలు, చేతి తొడుగులు, ముఖం, కిరీటం కూడా ఉంటాయి.

వృశ్చికరాశిలో మండల పూజకు అయ్యప్పకు థంక అంగీ తో అలంకరించడం సాంప్రదాయం. మండల పూజకు కొద్దిరోజుల ముందు అరన్ముల పార్థసారథి ఆలయం వద్ద తంగ వస్త్రం ఊరేగింపుగా సన్నిధానానికి బయలుదేరుతుంది. దీనిని థంక అంగీ రథ యాత్ర అంటారు. థంక అంగీ ఊరేగింపు వివిధ ఆలయాల వద్ద స్వాగతాన్ని స్వీకరించిన తర్వాత సన్నిధానానికి చేరుకుంతుంది. 18వ మెట్టు, గర్భగుడి, ధ్వజస్థంభంతో సహా శబరిమల ఆలయం మాదిరిగానే తయారు చేసిన రథంలో అయ్యప్ప స్వామి కొలువుదీరతారు.

మండల పూజకు నాలుగు రోజుల ముందు తెల్లవారుజామున బయలుదేరి థంక అంగీ, నిలక్కల్ పంప ద్వారా సన్నిధానం చేరుకుంటారు. శరంకుతికి చేరుకున్న థంక అంగీని దేవస్వం ప్రతినిధులు లాంఛనంగా స్వీకరించి సన్నిధానానికి తీసుకువస్తారు. 18వ మెట్టు ఎక్కి సోపానం వద్దకు చేరుకోగానే తంత్ర, మేల్శాంతి థంక అంగీ వస్త్రాన్ని అందుకుంటారు. అనంతరం అయ్యప్పకు దీపారాధన, మండల పూజలు నిర్వహిస్తారు. మండల పూజ అనంతరం థంక అంగీ వస్త్రాన్ని అరన్ముల పార్థసారథి ఆలయానికి తీసుకెళ్లి దేవస్వామ్‌లోని స్ట్రాంగ్‌రూమ్‌లో ఉంచుతారు. తొలినాళ్లలో కొట్టాయం నుంచి హంస రథంలో తంగ వస్త్రాన్ని సన్నిధానానికి తీసుకెళ్లేవారు. గత కొన్నేళ్లుగా శబరిమల దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు థంక అంగీ, దీపారాధన ఊరేగింపును చూసేందుకు భారీగా తరలివస్తున్నారు. ఈ ఏడాది కూడా మండలపూజకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ నెల 22న అరన్ముల పార్థసారథి ఆలయం నుంచి థంక అంగీ వస్త్రాన్ని ఊరేగింపుగా సన్నిధానానికి తీసుకుని వెళ్లనున్నారు. 22న ప్రారంభమయ్యే థంక అంగీ ఊరేగింపు ఆ రోజు రాత్రి ఓమల్లూర్ ఆలయం, 23న కొన్ని ఆలయం, 24న పెరునాడ్ ఆలయంలో విశ్రాంతి తీసుకుంటుంది. 25వ తేదీ మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఊరేగింపుగా పంపకు చేరుకుంటుంది. అనంతరం ఊరేగింపు ఉదయం 5 గంటలకు శరంకుఠికి చేరుకుని దేవస్వామ్ అధికారులు లాంఛనంగా సోపానం వద్దకు తీసుకువెళ్లనున్నారు. 26వ మండల పూజలో తంగ వస్త్రాన్ని అయ్యప్ప స్వామి విగ్రహానికి ధరింపజేయనున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *