సెకండ్ ఇన్నింగ్స్‌లో సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్న మెగా డాటర్ నిహారిక కొణిదెల కూడా ఆడియన్స్‌కు షాక్ ఇచ్చారు. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న తమిళ మూవీలో గ్లామర్ రోల్లో అదరగొడుతున్నారు.
మద్రాస్కారన్ పేరుతో రూపొందుతున్న సినిమాలో గ్లామర్ రోల్లో ఆడియన్స్‌కు షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. మరోవైపు నిర్మాతగానూ తన మార్క్ చూపిస్తున్నారు కొణిదెలవారి అమ్మాయి నిహారిక.
చాలా కాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నా… హీరోయిన్గా ప్రూవ్ చేసుకోలేకపోతున్న తెలుగమ్మాయి ఈషా రెబ్బా. తెర మీద హోమ్లీ క్యారెక్టర్స్ మాత్రమే చేస్తున్న ఈషా… సోషల్ మీడియాలో మాత్రం గ్లామరస్ ఫోటోషూట్స్‌తో రచ్చ చేస్తుంటారు. ఈ ఫోటోషూట్స్ చూసైనా తనకు గ్లామర్ హీరోయిన్స్ రోల్స్ ఇస్తారేమో అన్న ఆశతో ఉన్నారు ఈ బ్యూటీ.
కెరీర్ స్టార్టింగ్ నుంచే గ్లామర్ ఇమేజ్ను కంటిన్యూ చేస్తున్న తెలుగుమ్మాయి ప్రియాంక జవాల్కర్. విజయ్ దేవరకొండ సరసన టాక్సీ వాలా సినిమాలో నటించిన ప్రియాంక, ట్రెడిషనల్ లుక్‌తో పాటు గ్లామర్ యాంగిల్‌ను కూడా రివీల్ చేశారు. అయినా ఈ బ్యూటీకి అవకాశాలు మాత్రం రావటం లేదు.
ఈ రూల్‌ను బ్రేక్ చేసిన ఒకే ఒక్క తెలుగమ్మాయి శోభితా ధూళిపాల. మోడలింగ్ రంగం నుంచి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన శోభితా.. తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్లో కూడా బిజీగా ఉన్నారు. మిస్ ఇండియా టైటిల్ విన్నర్ కూడా కావటంతో, ఈ భామ గ్లామర్, సినిమాకు ప్లస్ అవుతుందన్న నమ్మకంతో శోభితాకు వరుస అవకాశాలు ఇస్తున్నారు నార్త్ మేకర్స్.