ఎవరైనా విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలు, డబ్బు దొంగిలిస్తారు. కానీ వీళ్లు అదో టైపు..! కోళ్ల చోరీలు వీరి ప్రత్యేకత.. చికెన్ సెంటర్స్‌ను టార్గెట్ చేసే ఈ దొంగలు రాత్రికి రాత్రే కోళ్లను దొంగిలించి, ఆటోలో అపహారించుకుపోతుంటారు. మాయమవుతున్న కోళ్లతో కంగారుపడ్డ వ్యాపారులను పోలీసులను ఆశ్రయించారు. దీంతో సీసీ కెమెరాకు చిక్కిన దృశ్యాల ద్వారా ఈ కోళ్ల దొంగల అసలు కథ బయటపడింది.
మహబూబాబాద్ జిల్లాలో ఈ మధ్య వరుసగా కోళ్ల దొంగతనాలు జరుగుతున్నాయి. ఒకటి రెండు కోళ్ళు పోవడంతో కొంతమంది లైట్ తీసుకున్నారు. కానీ డోర్నకల్ మండల కేంద్రంలోని భవాని చికెన్ సెంటర్‌లో పెద్ద ఎత్తున కోళ్లు తెల్లవారిసరికే మాయం కావడంతో యాజమాని మహేష్ కు డౌట్ వచ్చింది. దీంతో దుకాణంలో అమర్చిన సీసీ కెమెరాలు చెక్ చేశాడు. ఇంకేముంది ఆ కోళ్ల దొంగను చూసి షాక్ అయ్యాడు. ఆటోలో వచ్చినా కోళ్ల దొంగలు.. చికెన్ సెంటర్ ముందు స్టాండ్ లో నిర్బంధించి ఉన్న కోళ్లను అపహరించుకుపోయాడు.
వీడియో చూడండి…
తెల్లవారుజామున ఇలా కోళ్లను దొంగిలించడం వీళ్ళ ప్రత్యేకత.. ఆటో లో వచ్చిన ఈ కోళ్ల దొంగలు ఎవరు అనేది అంతుచికడం లేదు. దొంగిలించిన కోళ్లను ఎక్కడైనా తక్కువ ధరకు అమ్ముకుంటున్నారా లేక వాళ్ళే ఈ కోళ్లను తింటున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా షాపులో జరిగిన కోళ్ల చోరీ ని గుర్తించిన షాప్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ విచిత్ర దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..