Telangana: రెస్టారెంట్‌కి వెళ్లి బిర్యానీ ఆర్డర్ చేశారు..ఆపై వేడి వేడిగా తింటుండగా..

Telangana: రెస్టారెంట్‌కి వెళ్లి బిర్యానీ ఆర్డర్ చేశారు..ఆపై వేడి వేడిగా తింటుండగా..


సాధారణంగా చికెన్​ బిర్యానీ మంచిగా ఘుమఘుమలాడాలంటే.. గసగసాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వంటి సుగంధ ద్రవ్యాలు ఉండాలి.  అటుపైన కొత్తి మీర, పుదీనా కూడా కావాలి. ఇవన్నీ పడితేనే చికెన్ బిర్యానీకి అసలైన టేస్ట్ వస్తుంది. కానీ ఎంతో ఫేమస్ అయిన హైదరాబాద్ చికెన్ బిర్యానీలో చికెన్‌కు బదులు.. పురుగులు, బల్లులు, జెర్రిలు వంటివి దర్శనమివ్వడం కామన్ అయిపోయింది. ఇలాంటి ఘటనలు పదే పదే వెలుగుచూస్తున్నాయి. దీంతో బయట బిర్యానీ తినాలంటేనే జనం బెంబేలెత్తిపోతున్నారు.

యాదాద్రి భువనగరి జిల్లా బీబీ నగర్ మండలం మక్త అనంతారం గ్రామానికి చెందిన బింగి ఐలయ్య అతడి స్నేహితులతో కలిసి  మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఘట్​కేసర్ పోలీస్​స్టేషన్ పరిధి ఆదర్శ్ బార్ అండ్ రెస్టారెంట్​లో బిర్యానీ తిందామని వెళ్లారు. అక్కడ ఫ్రెండ్స్‌ అంతా కలిసి చికెన్‌ బిర్యానీ ఆర్డర్ చేశారు. వేడి వేడి బిర్యానీ సర్వ్‌ చేశారు అక్కడి హెటల్ స్టాఫ్. అందరూ కలిసి బిర్యానీ తింటుండగా, ప్లేట్​లో బ్లేడ్ రావడంతో ఒక్కసారిగా షాకయ్యారు. ఇదేంటని యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలియక వచ్చిందని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో బాధితుడు ఘట్​కేసర్ పోలీస్​స్టేషన్​లో కంప్లైంట్ చేశారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలో టీటీ చేయించుకున్న బాధితుడు మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *