మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని శివలింగపూర్ గ్రామంలో కొండచిలువ జనావాసంలోకి రావడంతో ప్రజలు కంగుతున్నారు. గ్రామానికి చెందిన సత్యనారాయణ రెడ్డి గోశాలలో ఇండియన్ పైథాన్ జాతికి చెందిన కొండచిలువ దూరింది. అక్కడ ఉన్న 3 కోళ్లను తినేసింది. గమనించిన గోశాల నిర్వాహకులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన డ్యూటీలో ఉన్నా డిప్యూటీ రేంజ్ అధికారి ప్రభాకర్, బేస్ క్యాంప్ వాచ్‌మన్ దాసరి అశోక్‌తో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. కొండచిలువను చాకచక్యంగా సంచిలో బంధించారు. అనంతరం సమీప అడవిలో విడిచి పెట్టారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి