ఓరుగల్లు అబ్బాయి.. ఇటలీ అమ్మాయి.. మనసులు కలిశాయి.. వాళ్ల పెళ్లికి పెద్దలు సై అన్నారు.. ఇంకేముంది అచ్చ తెలుగు ఆచార సంప్రదాయాల ప్రకారం పెళ్లి వేడుకలు చకచకా జరిగి పోతున్నాయి. 18న పెళ్లి వేడుక ఉండగా శనివారం సాయంత్రం సంగీత్ నిర్వహించారు. ఈ వేడుకలో ఇటలీ అతిధులు తెగ సందడి చేశారు.. ఖండాంతరాలు దాటిన ఆ పెళ్లి సంబరాలను స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.
వరంగల్‌లోని పోచమ్మ మైదాన్‌కు చెందిన కొడిపాక సూర్యప్రీతం ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లాడు.. ఈ క్రమంలో తనతో చదువుతున్న ఇటలీకి చెందిన మార్ట ఫ్రిట్టెల్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా… ప్రేమగా మారడంతో… ఇద్దరి తల్లిదండ్రులను ఒప్పించి.. వివాహ బంధంతో ఏకమవవబోతున్నారు. ఈనెల 18న వరంగల్ నగరంలోని ఓ ఫంక్షన్‍హాల్లో సంప్రదాయ పద్ధతిలో వివాహానికి ఏర్పాట్లు చేశారు.. పెళ్లికి ముందు నిర్వహించిన నిశ్చితార్థం, సంగీత్ వేడుకలో అమ్మాయి, అబ్బాయితో పాటు ఇటలీ నుంచి వచ్చి న వధువు ఫ్యామిలీ సభ్యులంతా లోకల్ మాస్ పాటలకు స్టెప్పులు వేశారు. వారిని స్థానికులు ఆసక్తిగా తిలకించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..