Tata electric bike: తగ్గేదేలే అనే రేంజ్‌లో టాటా బైక్.. ధర, ఇతర వివరాలు ఇవే..!

Tata electric bike: తగ్గేదేలే అనే రేంజ్‌లో టాటా బైక్.. ధర, ఇతర వివరాలు ఇవే..!


టాటా ఎలక్ట్రిక్ బైక్ లో అనేక ఫీచర్లు ఉన్నాయి. డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, స్పీడో మీటర్, ఓడో మీటర్, ట్రిప్ మీటర్ ను ఏర్పాటు చేశారు. వాహనం వేగాన్ని నియంత్రించేందుకు డిస్క్ బ్రేకులు అమర్చారు. ట్యూబ్ లెస్ టైర్లతో ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. దీనిలోని 4.3 అంగుళాల ఎల్ ఈడీ స్క్రీన్ లో వాహనం స్పీడ్, మైలేజీ తదితర వాటిని క్షుణ్ణంగా చూడవచ్చు. అలాగే మూడు రకాల విభిన్న రంగులలో ఈ బైక్ అందుబాటులో ఉంది. ఎలక్ట్రిక్ బైక్ లో 4.3 కేడబ్ల్యూ బ్యాటరీ ఏర్పాటు చేశారు. ఒక్కసారి రీచార్జి చేసుకుంటే దాదాపు 315 కిలోమీటర్లు పరుగెడుతుంది. చార్జింగ్ కోసం రోజంతా ఉంచాల్సిన అవసరం లేదు. కేవలం నాలుగు గంటల పాటు చార్జింగ్ పెడితే వంద శాతం పూర్తిగా చార్జింగ్ అవుతుంది.

అయితే సరికొత్త టాటా మోటారు సైకిల్ మార్కెట్ లోకి ఎప్పుడు విడుదల అవుతుందో కచ్చితమైన సమాచారం లేదు. అతి త్వరలోనే టాటా కంపెనీ దీన్ని లాంచ్ చేస్తుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. దీని ప్రారంభ ధర రూ.1,29,000 ఉండవచ్చని అంచనా. మన దేశంలో అధిక రేంజ్ వచ్చే ఎలక్ట్రిక్ మోటారు సైకిళ్లకు ప్రజల ఆదరణ ఎక్కువగా ఉంటుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించేందుకు ఇవి వీలుగా ఉంటాయి. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఉపయోగపడేలా టాటా కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ బైక్ ను విడుదల చేయనుంది. వాహనం కొనుగోలు చేసేటప్పుడు కస్టమర్ల ఎక్కువగా ఆలోచించేంది రేంజ్ కోసమే. అది బాగున్నప్పుడు డబ్బులను ఆదా చేసుకునే వీలుంటుంది.

టాటా కంపెనీ నుంచి విడుదలయ్యే వాహనాల కోసం ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఆ బ్రాండ్ కు ఉన్న ప్రత్యేకత గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. ప్రజల ఆదరణకు అనుగుణంగా ఆ కంపెనీ సరికొత్త అప్ డేట్ లతో దూసుకుపోతుంది. ఎలక్ట్రిక్ విభాగంలోనూ తన స్థానాన్ని మెరుగుపర్చుకుంటోంది. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఈవీల సామర్థ్యం పెంచుతూ పోతోంది. ప్రత్యేక డిజైన్లు, అడ్వాన్స్ డ్ ఫీచర్లు, లేటెస్ట్ టెక్నాలజీ, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా వాహనాలను విడుదల చేస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *