సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, భారత దేశీయ టి20 టోర్నమెంట్, ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. ప్రముఖ భారత ఆటగాళ్లలో ఒకరైన హార్దిక్ పాండ్యా ఈ సీజన్‌లో బరోడా తరఫున ఆడుతున్నారు. దేశీయ క్రికెట్ ఆటల్లో కూడా అభిమానుల భారీ స్పందన వస్తోంది. ఇక పాండ్యా వంటి స్టార్ ఆటగాళ్లు ఈ టోర్నీకి మరింత జోష్ తీసుకువస్తున్నారు. అయితే, బరోడా వర్సెస్ ముంబై మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో చిన్నస్వామి స్టేడియంలో కొన్ని ఆసక్తికర ఘటనలు చోటుచేసుకున్నాయి.
కొంతమంది అభిమానులు తమ అభిమాన క్రికెటర్లను చూడటానికి భద్రతా పరిమితులు అధిగమించి మైదానంలోకి ప్రవేశించారు. భద్రతా సిబ్బంది వారిని బయటకు పంపే ప్రయత్నం చేస్తుండగా, హార్దిక్ పాండ్యా ప్రేక్షకుల గుండెలను గెలుచుకునేలా ఒక హృదయపూర్వక సంజ్ఞ చూపించారు. అభిమానుల వైపు వెళ్లి, భద్రతా సిబ్బందికి అభిమానులను మర్యాదపూర్వకంగా బయటకు పంపాలని సూచించారు. పాండ్యా చూపిన ఈ చొరవతో మైదానంలో ఉన్నవారు హార్దిక్ నిరజనాలు పలికారు. చప్పట్లతో ప్రశంసలు అందించారు.
ఈ మ్యాచ్‌లో పాండ్యా భారీగా ప్రభావం చూపలేకపోయినప్పటికీ, తన హృదయపూర్వక సంజ్ఞతో అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. బరోడా మాత్రం ఈ మ్యాచ్‌లో ఓడిపోయింది. అజింక్య రహానే 56 బంతుల్లో 98 పరుగుల తుఫాన్ ఇన్నింగ్స్ ఆడటంతో ముంబై 159 పరుగుల లక్ష్యాన్ని 17.2 ఓవర్లలోనే చేధించింది.
పాండ్యా, బరోడా తరఫున బౌలింగ్ ఆరంభించి, పృథ్వీ షాను అవుట్ చేశాడు. తన ఆల్‌రౌండర్ ప్రతిభను టోర్నమెంట్‌లో నిరూపించిన పాండ్యా, భారత జట్టుకు కీలక ఆటగాడిగా నిలిచే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక, ఫైనల్ పోరులో ముంబై మధ్యప్రదేశ్తో తలపడనుంది. మరో సెమీఫైనల్లో మధ్యప్రదేశ ఆటగాడు రజత్ పాటిదార్ 29 బంతుల్లో 66 పరుగులతో మెరిసాడు.
అవకాశం వచ్చినప్పుడల్లా, అభిమానుల మనసులు గెలవడం హార్దిక్ పాండ్యాకు ప్రత్యేకత. అతని హృదయపూర్వక దృక్పథం భారత క్రికెట్ అభిమానుల్లో అనేక ప్రశంసలను రాబట్టింది.
Hardik Pandya tells security guys not to use force on three guys who came to meet him. Got a huge roar from the crowd👏🏻
A beautiful gesture from Hardik Pandya❤️ pic.twitter.com/JxtDaT523q
— Rohan Gangta (@rohan_gangta) December 13, 2024