ఆదివారం అంటే ఇప్పుడు చాలా మందికి నాన్ వెజ్ తినే రోజుగా మారిపోయింది. అయితే హిందూ సనాతన ధర్మంలో ఆదివారానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే చాలా మందికి తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా తినే ఆహారం విషయంలో పెద్దగా పట్టించుకోరు. కొన్ని రకాల ఆహార పదార్ధాలను తినడం వలన సూర్యుడికి కోపం వస్తుందని నమ్మకం. ముఖ్యంగా ఎవరి జాతకంలో నైనా సూర్యుడు స్థానం సరిగ్గా లేకపోయినా, సూర్యుడు చెడు స్థానంలో ఉన్నా ఆదివారాలు కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండడం మంచిది. ఈ రోజు ఆదివారం వేటిని తినకూడదో తెలుసుకుందాం..
- ఆదివారం రోజున ఉల్లి వెల్లుల్లిని తినే ఆహారంలో లేకుండా చూసుకోవాలి. ఉల్లిపాయలను, వెల్లుల్లి తినడం ఆరోగ్యానికి మంచిదే. .. అయితే ఆదివారం తినడం వలన అనారోగ్యానికి కారణం అని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది.
- ఆదివారం రోజున చిక్కుడు, బీన్స్ వంటి వాటిని తీసుకోవద్దు.
- ఆదివారం రోజున పాలకూరని కూడా తినకూడదు. పాలకూరని ఆదివారం తినడం అశుభమని నమ్మకం.
- ఆదివారం చేపలని కూడా తినొద్దు. చాలా మంది ఆదివారం అంటే నాన్ వెజ్ తినే రోజుగా భావిస్తారు. మాంసాహారాన్ని తీసుకుంటూ ఉంటారు. అయితే చేపలు తినడం అశుభం అని చెబుతున్నారు.
- బచ్చలికూర, మద్యం, మాంసానికి, మగువకు ఆదివారం దూరంగా ఉండటమే శ్రేయస్కరం.
- ఈ ఆహారం ఆదివారం తీసుకోవడం వలన సూర్య భగవానుడికి కోపం వస్తుందని.. జీవితంలో కష్టాలు వస్తాయని అనారోగ్యంతో ఇబ్బంది పడతారని నమ్మకం.
- ఎర్ర తోటకూర, ఉసిరికాయలను ఆదివారం రోజున తినడం తరచుగా అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది
ఇవి కూడా చదవండి
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.