తినడానికి ఇష్టపడే పండ్లలో స్ట్రాబెర్రీ ఒకటి. స్ట్రాబెర్రీలు చాలా రుచికరమైనవి. వీటి వాసన కూడా బలేగా ఉంటుంది. అందుకే చాలా మంది వాటిని ఇష్టపడతారు. ఈ పండ్లతో రకరకాల వంటకాలు తయారుచేస్తారు. స్ట్రాబెర్రీలు రుచికే కాదు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.
స్ట్రాబెర్రీలలో కూడా అనేక ప్రయోజనకరమైన పోషకాలు ఉంటాయి. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచుకోవడానికి స్ట్రాబెర్రీలు ఉపయోగపడతాయి. అందుకే స్ట్రాబెర్రీలను అనేక సౌందర్య ఉత్పత్తులలో కూడా ఉపయోగిస్తారు.
స్ట్రాబెర్రీలను ఉపయోగించి ఫేస్ ప్యాక్ కూడా తయారు చేసుకోవచ్చు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఒత్తిడి, వాపు నుండి రక్షిస్తుంది.
స్ట్రాబెర్రీలు క్యాన్సర్, గుండె జబ్బుల వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుండి కూడా రక్షిస్తాయి. స్ట్రాబెర్రీ తినడం వల్ల బరువు తగ్గవచ్చు. ఇందులోని పీచు, పోషకాలు ఆకలిని నియంత్రిస్తాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు స్ట్రాబెర్రీలు ఎంతగానో ఉపయోగపడతాయి.
వీటిల్లోని విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా స్ట్రాబెర్రీలు గ్రేట్ గా సహాయపడుతాయి. పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరం నుండి మలినాలను, బ్యాక్టీరియాను తొలగిస్తుంది.