Somavati Amavasya: జీవితంలో సుఖశాంతుల కోసం సోమవతి అమావాస్య రోజున చేయాల్సిన పరిహారాలు ఏమిటంటే..

Somavati Amavasya: జీవితంలో సుఖశాంతుల కోసం సోమవతి అమావాస్య రోజున చేయాల్సిన పరిహారాలు ఏమిటంటే..


సోమవతి అమావాస్య హిందూ మతంలో ఒక ప్రత్యేకమైన రోజు. సోమవారం అమావాస్య తిధి వస్తే.. ఆ రోజుని సోమవతి అమావాస్య అని అంటారు. ఈ రోజు శివపార్వతికి అంకితం చేయబడింది. ఈ రోజున శివపార్వతులను పూజించడం వల్ల అన్ని కోరికలు నెరవేరుతాయని, జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయని నమ్మకం. ఈ రోజున శివ పార్వతులను ఆరాధించడం వలన విశేష ఫలితాలు లభిస్తాయని.. ఈ రోజు పూర్వీకులను తలచుకుని ప్రార్దించడం వలన ఆశీర్వాదం లభిస్తుందని .. కనుక ఈ రోజు చాలా పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ రోజున చేసే పూజల వల్ల కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. సోమవతి అమావాస్య రోజున చేసే చర్యల వల్ల జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి. ఈ రోజున చేసే పూజలు ఇంట్లో సుఖ సంతోషాలను, శ్రేయస్సును కలిగిస్తాయి.

పంచాంగం ప్రకారం మార్గశిర మాసం కృష్ణ పక్షంలోని అమావాస్య తిథి డిసెంబర్ 30 ఉదయం 4:01 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు డిసెంబర్ 31 తెల్లవారుజామున 3:56 గంటలకు ముగుస్తుంది. ఉదయతిథి ప్రకారం సోమవతి అమావాస్య డిసెంబర్ 30 న మాత్రమే జరుపుకోవాలి.

సోమవతి అమావాస్య రోజున చేయాల్సిన పరిహారాలు

  1. సోమవతి అమావాస్య రోజున శివలింగానికి నీరు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి మొదలైన వాటితో అభిషేకం చేయండి.
  2. సోమవతి అమావాస్య నాడు ఉపవాసం ఉండడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి.
  3. ఇవి కూడా చదవండి

  4. ‘ఓం నమః శివాయ’ అనే మంత్రాన్ని జపించండి.
  5. పేదలకు , ఆకలి అన్నవారికి దానం చేయండి.
  6. రావి చెట్టుకు నీరు సమర్పించి దీపం వెలిగించండి.
  7. పూర్వీకులకు తర్పణం సమర్పించడం వల్ల వారి ఆత్మకు శాంతి చేకూరుతుంది.
  8. పార్వతీదేవిని ఆరాధించడం వల్ల సుఖసంతోషాలు, ఐశ్వర్యం కలుగుతాయి.

ఈ మంత్రాలను జపించండి

ఓం త్ర్యంబకం యజామహే సుగన్ధి పుష్టివర్ధనమ్ । ఉర్వారుకమివ్ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మమృతాత్ ।
ఓం నమః శివాయ

కర్పూర్ గౌరం కరుణావతారం సంసారసారం భుజగేన్ద్రహారమ్ । సదా వసంతం హృదయారవిందే భవం భవానీసహితం నమామి. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్

ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి

సోమవతి అమావాస్య రోజున ఉపవాసం ఉంటే.. దాని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. శివపురాణం పఠించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సోమవతి అమావాస్య రోజున శివాలయాన్ని సందర్శించండి. అయితే ఈ రోజున నల్లని వస్త్రాలు ధరించకూడదని, మాంసం , మద్యం సేవించకూడదని గుర్తుంచుకోండి. అంతేకాదు ఈ రోజున ఎవరితోనూ అబద్ధాలు చెప్పకండి. రోజున కోపం తెచ్చుకోకండి. కుటుంబంలో సామరస్యాన్ని కాపాడుకోండి. ఈ చర్యలను అనుసరించడం ద్వారా జీవితంలో ఆనందాన్ని, శ్రేయస్సును తీసుకురావచ్చు. అన్ని రకాల ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందవచ్చు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *