చైతన్యలాంటి వ్యక్తి భర్తగా రావడం తన అదృష్టమని పేర్కొన్నారు. సింప్లిసిటీ, మంచి మనసు, దయ, ఇతరులపట్ల మర్యాదగా ఉంటూ, హుందాగా ప్రవర్తించే చైతూ లక్షణాలు తనని ఆకట్టుకున్నాయని తెలిపారు. తనను ఎంతగానో ప్రేమిస్తాడని, చాలా బాగా చూసుకుంటాడని భర్త నాగ చైతన్యపై పొగడ్తల వర్షం కురిపించారు.ఈ సందర్భంగా తమ వివాహవేడుకకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. ఇక నటిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తొలినాళ్లలో తనకు ఎన్నో తిరస్కరణలు ఎదురయ్యాయని శోభిత వెల్లడించారు. అందంగా లేనని, ఆకర్షణీయంగా కనిపించనని తన ముఖం మీదే చెప్పేవారని తెలిపారు. ఓ ప్రముఖ కంపెనీ వాణిజ్య ప్రకటనల కోసం ఆడిషన్స్‌కు వెళితే బ్యాక్ గ్రౌండ్ మోడల్‌గా కూడా పనికిరానని చెప్పడం తనను ఎంతో బాధించిందని వివరించారు. అయితే, పట్టుదలతో, ఆత్మవిశ్వాసంతో ప్రయత్నించి కొన్నాళ్ల తర్వాత అదే కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ అయ్యానని తెలిపారు. తనకు ఏదైనా పాత్ర నచ్చితేనే సినిమా ఒప్పుకుంటానని శోభిత తెలిపారు. ఎప్పుడూ తెరపై కనిపించాలనే కోరిక తనకు లేదని తన అభిరుచులకు తగిన పాత్ర అయితేనే చేస్తానని స్పష్టం చేశారు.
తనకు ఒకరిద్దరు పిల్లలు చాలని, చిన్నతనంలో తాను గడిపిన మధుర క్షణాలన్నీ వాళ్లతో తిరిగి పొందాలని నాగచైతన్య తాజాగా రానా టాక్ షోలో పంచుకున్నారు. తనకు 50 ఏళ్లు వయసు వచ్చేసరికి పిల్లలతో సంతోషంగా ఉండాలని అనుకుంటున్నట్టు తెలిపారు. మధ్యలో రానా కలగజేసుకుని ఏంటి.. వెంకీమామలా ముగ్గురు, నలుగురు కావాలా అనగానే.. లేదు లేదు ఒకరిద్దరు చాలు. వెంకీమామది పెద్ద కుటుంబం. నాకు కొడుకు పుడితే వాడిని రేస్ ట్రాక్‌కు తీసుకెళ్తా. కూతురు పుడితే, తనకు ఎలాంటి హాబీలు ఉంటాయో వాటిని గుర్తించి ప్రోత్సహిస్తా. నాకు వాళ్లతో ఎక్కువ సమయం గడపాలని ఉంది. మనం చిన్నప్పుడు పిల్లలుగా కొన్ని క్షణాలు ఎంజాయ్ చేశాం. ఆ క్షణాలను వాళ్లతో కలిసి మళ్లీ ఆస్వాదించాలని ఉందని చెప్పుకొచ్చారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.