Smart phones: చార్జింగ్సమస్యకు ఇక చెక్..స్మార్ట్ ఫోన్ల బ్యాటరీ సామర్థ్యంపై ఆ కంపెనీ ఫోకస్

Smart phones: చార్జింగ్సమస్యకు ఇక చెక్..స్మార్ట్ ఫోన్ల బ్యాటరీ సామర్థ్యంపై ఆ కంపెనీ ఫోకస్


బ్యాటరీ బ్యాకప్ బాగున్నప్పడే రోజంతా ఫోన్ పనిచేస్తుంది. అస్తమాను చార్జింగ్ పెట్టే అవసరం ఉండదు. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఫోన్ల బ్యాటరీ సామర్థ్యం పెంచేందుకు తయారీ కంపెనీలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రెడ్ మీ, వన్ ప్లస్ కంపెనీలు వచ్చే ఏడాది 7000 ఎంఏహెచ్ బ్యాటరీలతో స్మార్ట్ ఫోన్లను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. రెడ్ మీ, వన్ ప్లస్ కంపెనీల విడుదలయ్యే స్మార్ట్ ఫోన్లకు దేశ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. నాణ్యత, పనితీరు విషయంలో ఎంతో మెరుగ్గా ఉండే ఈ ఫోన్లను కొనుగోలు చేయడానికి అందరూ ఇష్టపడతారు. ఈ నేపథ్యంలో ఈ రెండు బ్రాండ్ల నుంచి ఈ ఏడాది కొత్త చిప్ సెట్లు, అధిక బ్యాటరీ సామర్థ్యం కలిగిన స్మార్ట్ ఫోన్లు విడుదల అయ్యాయి. ఇదే ఒరవడితో మరింత మెరుగైన బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఫోన్లను విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకున్నాయి. ప్రస్తుతం ఈ కంపెనీలు తమ రాబోయే ఫోన్లలో 7000 ఎంఏహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నాయని సమాచారం. కాగా.. రియల్ మీ ఇదే బ్యాటరీతో తన నియో 7 ఫోన్ ను డిసెంబర్ 11న విడుదల చేసింది.

కొత్త సంవత్సరంలో మెరుగైన బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఫోన్ల విడుదలకు నాంది పలకనున్నారు. రెడ్ మీ, వన్ ప్లస్ ఇప్పటికే ఈ పోటీలోకి వస్తున్నట్టు తెలుస్తోంది. మిగిలిన కంపెనీలు కూడా ఇదే దారిలో పయనించి, బ్యాటరీపై ఎక్కువ ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. షియోమి 15 ఫోన్ లో 50 డబ్ల్యూ వైర్ లెస్ చార్జింగ్ కు మద్దతు ఇచ్చే 5400 ఎంఏహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. అలాగే షియోమి 15 ప్రో 6100 ఎంఏహెచ్, వన్ ప్లస్ 13 ఫోన్ 6000 ఎంఏహెచ్ బ్యాటరీలతో అందుబాటులో ఉన్నాయి. చైనా కంపెనీలు ప్రతి ఏటా బ్యాటరీ సామర్థ్యాన్ని మెరుగుపర్చుకుంటూ వెళుతున్నారు. తద్వారా మార్కెట్ లో తమ స్థానాన్ని మరింత మెరుగు పర్చుకునేందుకు ప్రణాళికలు వేస్తున్నాయి.

రియల్ మీ ఇప్పటికే నియో 7 ఫోన్ లో 7000 ఎంఏహెచ్ బ్యాటరీని పరిచయం చేసింది. వచ్చే ఏడాది 8000 ఎంఏహెచ్ కు విస్తరించాలని భావిస్తోంది. ఇక ఒప్పో కంపెనీ నుంచి 6400, 6300, 7000 ఎంఏహెచ్ బ్యాటరీలతో ఫోన్లు విడుదలయ్యాయి. ఇటీవలే 6150 బ్యాటరీతో ఐక్యూ 13 స్మార్ట్ ఫోన్ విడుదలైంది. అలాగే రియల్ మీ చైనాలో 6500 ఎంఏహెచ్ సామర్థ్యంతో రియల్ బీ జీటీ 7 ప్రో ఫోన్ ను ఆవిష్కరించింది. అయితే ఈ కంపెనీ గ్లోబల్ వెర్షన్లు చిన్న బ్యాటరీలను కలిగి ఉంటాయి. దాని ప్రకారం మన దేశంలో 6000 ఎంఏహెచ్ తో ఐక్యూ 13, అలాగే 5800 ఎంఏహెచ్ బ్యాటరీతో రియల్ మీ జీటీ 7 ప్రో స్మార్ట్ ఫోన్లు విడుదలయ్యాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *