లెజెండరీ దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత శ్యామ్ బెనగల్ (90) కన్ను మూశారు. గత కొన్ని రోజులుగా వృద్ధాప్య సమస్యలకు తోడు అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన కాసేపటి క్రితమే తుదిశ్వాస విడిచారు. ముంబైలోని ఓ హాస్పిటల్‌లో ఆయన కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆస్పత్రి వైద్యులు ధ్రువీకరించారు.