షణ్ముఖ్ జశ్వంత్.. ఒకప్పుడు సోషల్ మీడియాలో ఈ పేరు చాలా పాపులర్. హీరో రేంజ్లో ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ ద్వారా యూట్యూబ్ స్టార్ గా పాపులర్ అయ్యాడు. షణ్ముఖ్ చేసిన ప్రతి షార్ట్ ఫిల్మ్ కొన్ని మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోయాయి. కానీ కొన్ని నెలలుగా అడియన్స్ ముందుకు రాలేకపోయాడు షణ్ముఖ్. తెలుగులో అత్యధిక సబ్ స్క్రయిబర్స్ కలిగిన మొదటి యూట్యూబర్ గా రికార్డ్ సెట్ చేసుకున్న షన్నూ.. ఆ తర్వాత వ్యక్తిగత జీవితంలో ఎదురైన సమస్యలతో సతమతమయ్యాడు. నిత్యం ఏదోక వివాదంతో వార్తలలో నిలిచాడు. ప్రేమ, బ్రేకప్, అరెస్ట్.. ఇలా ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నాడు. చివరకు ఎలాంటి కంటెంట్ చేయకుండా.. ప్రేక్షకుల ముందుకు రాకుండా అజ్ఞాతంలో ఉండిపోయారు. షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే దీప్తి సునైనాతో ప్రేమాయణం నడిపాడు. కానీ ఆతర్వాత బిగ్ బాస్ సీజన్ 5లోకి విన్నర్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన షన్నూ.. చివరకు రన్నరప్ అయ్యాడు.
బిగ్ బాస్ షో తర్వాత దీప్తితో బ్రేకప్ తో మానసికంగా ఒత్తిడికి గురయ్యాడు. కొన్నాళ్ల క్రితం గంజాయి సేవించాడని పోలీసులు అరెస్ట్ చేయడం.. ఆ తర్వాత వాళ్ల అన్నయ్య ఓ అమ్మాయిని మోసం చేశాడని.. డ్రంక్ అండ్ డ్రైవ్ ఇలా ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నాడు. దీంతో గత ఏడాది కాలంగా ఎలాంటి కంటెంట్ చేయకుండా.. అటు సోషల్ మీడియాలోనూ సైలెంట్ అయ్యాడు. ప్రస్తుతం షన్నూ కంబ్యాక్ ఇస్తున్నాడు. షణ్ముఖ్, అనఘ జంటగా తెరకెక్కిన లీల వినోదం సినిమా ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ డిసెంబర్ 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఇందుకు సంబంధించి ప్రెస్ మీట్ నిర్వహించగా.. చాలాకాలం తర్వాత స్టేజ్ పై మాట్లాడుతూ ఏడ్చేశాడు షణ్ముఖ్ జస్వంత్.
చాలాకాలం తర్వాత మీడియా ముందుకు వచ్చిన షణ్ముఖ్ జశ్వంత్ తన జీవితంలో ఎదురైన విమర్శలు, నెగిటివిటీ గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యాడు. “వైజాగ్ లో షార్ట్ ఫిలిమ్స్ చేసుకునే నేను హైదరాబాద్ వచ్చి కవర్ సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్, సిరీస్ లు చేసుకున్నాను. నాకు ఎలాంటి సపోర్ట్ లేదు. నేనే అమ్మనాన్నలను బాగా చూసుకోవాలి. కానీ నేను తప్పు చేయని తప్పులకు నన్ను బ్లేమ్ చేశారు. నా మీద చాలా నెగిటివిటీ చూపించారు. తట్టుకున్నాను.. కానీ నా ఫ్యామిలీ మీద కూడా నెగిటివిటీ చూపించారు. సక్సెస్ లో ఉన్నప్పుడు చాలా మంది మన పక్కన ఉంటారు. కానీ మనం పడినప్పుడు మన పక్కన ఉండే వాళ్లే నిజమైన మన వాళ్లు” అంటూ ఏడ్చేశాడు షణ్ముఖ్ జశ్వంత్.
ఇవి కూడా చదవండి
ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‌బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..
Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‌గా..
Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..
Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‌ను మించిన అందం.. ఎవరంటే..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.